24 సంవత్సరాల సర్వీసు పూర్తైన ఉపాధ్యాయులకు గెజిటెడ్ హోదా కల్పించాలని… ఆర్.యు.పి.పి.టి. రాష్ట్ర శాఖ సహాధ్యక్షులు వేల్పుల స్వామి యాదవ్…
పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ జనవరి 15 మామిడిపెల్లి లక్ష్మణ్ రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు తెలంగాణ రాష్ట్ర శాఖ సహాధ్యక్షులుగా వేల్పుల స్వామి యాదవ్ ను ఎన్నుకున్నట్లు రాష్ట్ర శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు యం.డి అబ్దుల్లా, క్రాంతి కృష్ణ లు ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల-12 న జరిగిన నూతన రాష్ట్ర కార్యవర్గ ఎన్నిక సమావేశంలో జగిత్యాల జిల్లా రాయికల్ మండలం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇటిక్యాల లో పని చేస్తున్న వేల్పుల స్వామి యాదవ్ రాష్ట్ర శాఖ సహాధ్యక్షులుగా ఎన్నికైనట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర సహాధ్యక్షులు గా ఎన్నికైన వేల్పుల స్వామి యాదవ్ మాట్లాడుతూ సంఘ పటిష్ఠతకు కృషి చేస్తొనని, 1/2005 ఆక్ట్ రద్దు చేసి భాషోపాధ్యాయులకు నియామకం తేది నుండి నోషనల్ గానైనా సర్వీస్ ప్రొటెక్షన్ కల్పించాలని, 24 సంవత్సరాల సర్వీసు పూర్తి అయిన ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులకు గెజిటెడ్ హోదా కల్పించాలని, ప్రాథమిక పాఠశాల ల్లో హిందీని ప్రవేశపెట్టి తెలుగు హిందీ పండితులను నియమించాలని అన్నారు. సహాధ్యక్షులుగా నియమించిన రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు కృతజ్ఞతలు తెలిపారు.