
పయనించే సూర్యుడు.ఫిబ్రవరి 15. ఖమ్మం జిల్లా బ్యూరో ఇంచార్జ్ గుగులోత్ భావుసింగ్ నాయక్ శ్రీ శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి వేడుకలకు మిమ్మల్ని ఆహ్వానించడానికి నేను సంతోషిస్తున్నాను! తేదీ: ఆదివారం, ఫిబ్రవరి 16, 2025 సమయం: ఉదయం 10:00 వేదిక: పడమట నరసాపురం గ్రామం, జూలూరుపాడు మండలం ఈ యొక్క ప్రభుత్వ కార్యక్రమం, నియోజకవర్గ స్థాయిలో నిర్వహించ బడుచున్నది కాబట్టి, దీనిని విజయవంతం చేయడానికి గిరిజన సోదర, సోదరీమణులు, అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు, సోదరులు ఈ కార్యక్రమమునకు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా వైరా నియోజకవర్గం ఎమ్మెల్యే మలోత్ రాందాస్ నాయక్ ఆహ్వానించడమైనది.