
ఫోటో : ఈద్గా వద్ద బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులు..
రుద్రూర్, మార్చ్ 31 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) : రంజాన్ పండుగను పురస్కరించుకుని రుద్రూర్ మండల కేంద్రం లోని చుట్టుపక్కల గ్రామాలల్లో సోమవారం ముస్లిం సోదరులు రంజాన్ పండుగను ఘనంగా నిర్వహించారు. గ్రామాలలో ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఒకరినొకరు అలై బలై తీసుకొని రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. సులేమాన్ నగర్ గ్రామంలో ఈద్గా వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ బందోబస్తులో రుద్రూర్ సీఐ కృష్ణ, ఎస్సై సాయన్న, పోలీసు సిబ్బంది ఉన్నారు.