
▪రోడ్డుపై బైఠాయింపు రాస్తారోకో, మాత్మ గాంధీ విగ్రహానికి వినతి పత్రం.
పయనించే సూర్యుడు జనవరి 30హుజురాబాద్ రూరల్ రిపోర్టర్ బండ శివానంద రెడ్డి
మా ఇల్లు మాకు కావాలంటూ హుజురాబాద్ జర్నలిస్టులు చేపట్టిన నిరసన కార్యక్రమాలు ఉదృతమయ్యాయి. ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా నాలుగో రోజు హుజురాబాద్ జర్నలిస్టులతో పాటు వివిధ పార్టీలు, ప్రజా సంఘాలు, కుల సంఘాలతో ప్రెస్ క్లబ్ నుంచి ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ చౌరస్తాలో బైఠాయించారు. అనంతరం రాస్తారోకో నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు పార్టీ నాయకులు మాట్లాడుతూ… జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం పెడచెవిన పెట్టడం సిగ్గుచేటు అన్నారు. గత ప్రభుత్వంలో కేటాయించిన ఇళ్ల స్థలాలలో జర్నలిస్టులు లక్షలు వెచ్చించి గృహ నిర్మాణాలు చేసుకున్నారని, వెంటనే వాటిని పూర్తిస్థాయిలో వారికి కేటాయించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ప్రజలకు ,ప్రభుత్వానికి వారధిగా ఉండే జర్నలిస్టుల సమస్యలే పరిష్కరించకుంటే ప్రజా ప్రభుత్వ మని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం సామాన్య ప్రజల కష్టాలు ఎలా తీరుస్తుందని వారి ప్రశ్నించారు. వెంటనే నియోజకవర్గ ఇన్చార్జి వొడితల ప్రణవ్ బాబు తో పాటు మంత్రి పొన్న ప్రభాకర్ చొరవ తీసుకొని వారికి పూర్తిస్థాయిలో ఇళ్ళ నిర్మాణం చేసి ఇవ్వాలన్నారు. జర్నలిస్టుల ఇళ్ల సమస్య పరిష్కారం అయ్యేంతవరకు వారు చేపట్టే ప్రతి నిరసన కార్యక్రమంలో తమ పూర్తిస్థాయి మద్దతు ఉంటుందని అన్నారు. జర్నలిస్టు సమస్యలు పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో తీవ్రస్థాయిలో ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం జమ్మికుంట రోడ్డులో గల మహాత్మా గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో
ప్రెస్ క్లబ్ కన్వీనర్ గడ్డం ధర్మారెడ్డి, కో కన్వీనర్ లు కాయిత రాములు, ఎలక్ట్రానిక్ మీడియా డివిజన్ అధ్యక్షుడు మక్సుద్ ,మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ ,మాజీ మున్సిపల్ చైర్మన్ గందే రాధిక, బిఆర్ఎస్ నాయకుడు గందే శ్రీనివాస్, కొలిపాక శ్రీనివాస్ ,బిజెపి పట్టణ అధ్యక్షుడు తూర్పాటి రాజు , ప్రజాసంఘాల నాయకులు వేల్పుల ప్రభాకర్, మార్త రవి, చందుపట్ల జనార్ధన్, మాజీ కౌన్సిలర్లు మారపల్లి సుశీల కళ్ళపల్లి రామాదేవి, ముత్యం రాజు తాళ్లపల్లి శ్రీనివాస్ , బిజెపి నాయకు తూర్పాటి రాజు ,లక్ష్మి,రాజు ప్రెస్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.