ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి – తపస్

July 4, 2026 | తెలంగాణ

:పయనించే సూర్యుడు జులై5 మక్తల్ : పెండింగ్ లో ఉన్న ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం మక్తల్ మండల అధ్యక్షులు. నరసింహ మండల ప్రధాన కార్యదర్శి.రాకేష్ కుమార్ లు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.తపస్ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు ఈరోజు రాష్ట్రంలోని అన్ని మండలాలలో ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యలైన పిఆర్సి అమలు, పెండింగ్ డీఏల ప్రకటన, ఈ – కుబేర్ లో పేరుకుపోయిన బిల్లుల కు సత్వరం నిధులు మంజూరు చేయడం, పెన్షనర్లకు అన్ని రకాల పెండింగ్ బిల్లుల కు నిధుల మంజూరు, సిపిఎస్ రద్దు, కేజీబీవీ,మోడల్, గురుకుల ఆశ్రమ పాఠశాలల ఉపాధ్యాయుల సమస్యల సత్వర పరిష్కారం తోపాటు పాఠశాలల్లో మౌలిక వసతుల కొరకు సత్వరమే గ్రాంట్ల మంజూరు వంటి సమస్యల పరిష్కారం కోరుతూ శనివారంతపస్ మక్తల్ మండల శాఖ ఆధ్వర్యంలో మండల తహసీల్దార్.ద్వారా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.కి వినతి పత్రం అందజేయమైనది. ఈ కార్యక్రమంలో.జిల్లా ఉపాధ్యక్షులు నాగార్జున ప్రధాన కార్యదర్శి రవీందర్, జిల్లా సాంస్కృతిక కార్యదర్శి అపర్ణ, జిల్లా కార్యదర్శి వెంకట్ రాములు,మండలం కోశాధికారి అనిల్ రెడ్డి,మండల బాధ్యులు రాజగోపాల్, ఆంజనేయులు,రాముగౌడ్, రవీందర్ రెడ్డి,జగదీశ్, ప్రవర్ధన్, రాజంజనేయులు,శ్రీకాంత్,సురేష్ రాము,లక్ష్మణ్,అశోక్ గౌడ్, వెంకటేష్,కుబేర నరసింహ, నర్సిములు, మహేష్, రవికుమార్,వెంకటేష్,వీణ, కృష్ణవేణి, విజయశ్రీ, రేణుక, సుభాషిణి, వరలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper