కూకట్‌పల్లిలో ఘనంగా వంగవీటి మోహనరంగా 79వ జయంతి వేడుకలు
పయనించే సూర్యుడు న్యూస్ జూలై 4 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి : కూకట్‌పల్లి కాపు వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కెపిహెచ్బి టెంపుల్ బస్ స్టాప్ వద్ద నిర్వహించిన ప్రజా నాయకుడు వంగవీటి మోహనరంగా 79వ జయంతి వేడుకల్లో రాష్ట్ర బీజేపీ సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వరరావు అసోసియేషన్ సభ్యుల ఆహ్వానం మేరకు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వంగవీటి మోహనరంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.అనంతరం వారు మాట్లాడుతూ, ప్రజల కోసం నిరంతరం పోరాడిన ధైర్యవంతుడైన నాయకుడు వంగవీటి మోహనరంగా అని కొనియాడారు. సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతి, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. ప్రజా సేవే పరమావధిగా భావించి చివరి శ్వాస వరకు ప్రజల కోసం పనిచేసిన మహోన్నత వ్యక్తిత్వం రంగా గారిదని అన్నారు. ఈ కార్యక్రమంలో కేపిహెచ్బి కంటెస్టెంట్ కార్పొరేటర్ ప్రీతం రెడ్డి, కూకట్‌పల్లి కాపు వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు, వివిధ సామాజిక సంఘాల నాయకులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.