ఎందరో మహానుభావులు త్యాగఫలితమే స్వాతంత్ర్యం బీఎస్పీ నిర్మల్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ జగన్ మోహన్

August 15, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో :స్వాతంత్ర్యం అంటే సమాన హక్కులు,సమాన అవకాశాలు లభించే స్థితి !!అడ్వకేట్ జగన్ మోహన్అద్యక్షులు,బిఎస్పీ నిర్మల్ జిల్లానిర్మల్ జిల్లా కేంద్రంలో బిఎస్పీ పార్టీ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించుకోవడం జరిగింది,నిర్మల్ జిల్లా అద్యక్షులు అడ్వకేట్ జగన్ మోహన్ జాతీయ పతాకం ఆవిష్కరించారు,ఈ సందర్భంగా జగన్ మోహన్ మాట్లాడుతూ…మహనీయుల త్యాగాలను స్మరించుకోవాలని,యువత చేతిలో దేశ అభివృద్ధి ఉంటుంది అని అన్నారు, ఎందరో మహానుభావులు త్యాగఫలితమే స్వాతంత్రం అని అన్నారు, స్వాతంత్రం అంటే దేశానికి మాత్రమే కాదు సమాజంలో ప్రతి ఓక్కరికి సమాన హక్కులు,సమాన అవకాశాలు లభించే స్థితి అని అన్నారు,డెబై తొమ్మిది సంవత్సరము గడిచిన నేటివరకు అసమానతలు కోన సాగుతున్నాయి అని అందోళన వ్యక్తం చేశారు,రానున్న రోజుల్లో మార్పుకు ప్రజాస్వామ్య పరిరక్షణకు కృషి చేయాలని అన్నారు,మేదావులు ప్రజలు ఆలోచించాలని అన్నారు, కార్యక్రమంలో అడ్వకేట్ జగన్ మోహన్, చింతకుంట రాజేశ్వర్,లక్ష్మీ యాదవ్,గుండా సతీష్,కాటం ప్రభాకర్,పసుల సంజయ్ లు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు

🌐 Select Language:
📰 ePaper