భారతీయ జనతా పార్టీ జిల్లా మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలిగా శీలం ఉమా వెంకట రాఘవ కుమారి

August 15, 2026 | ఆంధ్రప్రదేశ్

పయనించే సూర్యుడు ఆగస్టు 15:*( ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) భారతీయ జనతా పార్టీ విశాఖపట్నం జిల్లా కార్యాలయంలో ఈరోజు శనివారం జిల్లా మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలిగా శీలం ఉమా వెంకట రాఘవ కుమారి నియమితులయ్యారు. భారతీయ జనతా పార్టీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు ఎంఎన్ పరశురామ రాజు నియామక పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా ఉమా వెంకట రాఘవ కుమారి మాట్లాడుతూ ఈ అవకాశం ఇచ్చిన జిల్లా అధ్యక్షులు ఎంఎంఎన్ పరశురామ రాజు, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు నాదెళ్ల జ్యోతిలకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి, మహిళల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper