
పయనించే సూర్యుడు జనవరి 19 : జగ్గయ్యపేట ప్రతినిధి భూక్యా కవిత : ఆంధ్రుల ఆరాధ్య దైవం, తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహా నాయకుడు అన్న శ్రీ నందమూరి తారకరామారావు 29 వ వర్ధంతి సందర్భంగా జగ్గయ్యపేట పట్టణంలో బంగారు కోట్ల సెంటర్ వద్ద నుండి భారీ బైక్ ర్యాలీతో ఎన్టీఆర్ సర్కిల్ వద్ద గల అన్న నందమూరి తారకరామారావు విగ్రహానికి తెదేపా నేతలతో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన శాసనసభ్యులు,టిడిపి జాతీయ కోశాధికారి శ్రీరాం రాజగోపాల్ తాతయ్య . అనంతరం జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్లకు బ్రెడ్స్ అందజేయడం జరిగింది. అనంతరం కాకాని నగరంలో గల ఎన్టీఆర్ విగ్రహానికి మరియు తొర్రగుంటపాలెంలో గల ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం అన్న క్యాంటీన్లో అన్న నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి అనంతరం ఉక్కు కళా వేదిక నందు మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీరామ్ సుబ్బారావు సౌజన్యంతో ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి అన్న వితరణ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య మాట్లాడుతూ దేశంలోనే మొట్టమొదటి సారిగా స్థానిక సంస్థలలో మహిళలకు,బిసి లకు రిజర్వేషన్లు ప్రవేశపెట్టి అనేకమంది మహిళకు,బిసిలకు రాజకీయ భవష్యత్తు ప్రసాదించారు.ఇది కూడా ఈరోజు దేశం అంతా అమలు అవుతున్నది. సందర్భంగా మనందరం అయన ఆశయ సాధనకు కృషి చేద్దాం అని అన్నారు.ఈ కార్యక్రమంలో శ్రీరాం సుబ్బారావు , శ్రీరాం చిన్నబాబు,రంగాపురం రాఘవేంద్రరావు, గింజుపల్లి రమేష్, మేక వెంకటేశ్వర్లు, మైనేని రాధాకృష్ణ, ఎలమంచిలి రాఘవ, పద్మనాభుని కుటుంబరావు, దూళిపాళ్ల లక్ష్మణరావు, కట్టా వెంకట నరసింహారావు, ఏలూరి గోపాలరావు, కౌన్సిలర్స్ కన్నెబోయిన రామలక్ష్మి, కంచేటి గీతారాణి, గింజుపల్లి వెంకటరావు, సంగెపు బుజ్జిబాబు మరియు వివిధ హోదాలలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.