
జనవరి 20 పయనించే సూర్యుడు బచ్చన్నపేట జనగామ జిల్లా.. మండలంలోని పోచన్నపేట గ్రామానికి చెందిన 528 సర్వేనెంబర్ కబ్జా కోరుల నుండి కాపాడమని తాను ఇచ్చిన ఫిర్యాదును బుట్ట దాఖలు చేసి తనపై నోరు పారేసుకున్నారని వికలాంగుండని కూడా చూడకుండా దుర్భాషలాడారని ఎమ్మార్వో ప్రకాష్ రావు పై నల్ల శ్రావణ్ కుమార బచ్చన్నపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. నల్ల శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ శనివారం సాయంత్రం రెవెన్యూ ఆఫీస్ కు వెళ్లిన తనని కులం పేరుతో నానా దుర్భాషలాడి ఆ భూమి మీకు ఎలా వచ్చిందని, ఆ భూమి విషయంలో ఇంకోసారి తన వద్దకు రావద్దని, కబ్జా విషయంలో తాము ఏమైనా చేస్తామని మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అని బెదిరించాడని ఫిర్యాదుదారు పత్రికాముఖంగా తెలియజేశారు. ఎమ్మార్వో వివరణ పై విషయంపై ఎమ్మార్వో ని వివరణ కోరగా ఇది అసత్యమని 1975లో 8 మందుకి అసైన్మెంట్ అయిన 528 సర్వే నంబర్1992లో చిట్టెల సిద్దయ్య ఎకరం 30 గుంటలు ఎక్కించుకోగా వారి మనవడైన నల్ల శ్రావణ్ కుమార్ తన పేరు మీద ఎక్కించాలని కోరడమైనదని దీనిని సర్వే చేయవద్దని నల్ల శ్రావణ్ కుమార్ తన వద్దకు వచ్చాడని సర్వే చేయకుండా ఏమైనా కోర్టు నోటీసులు గానీ ఏమైనా ఉన్నాయా అని చెప్పి అడగ్గా అదంతా నీకు అనవసరం అంటూ తనపై దుర్భాషలాడాడని అంతేకానీ తనను నేను అన్నా అని అన్నదాంట్లో ఎలాంటి సత్యం లేదని భూమి పోతుందన్న అక్కస్తోనే కుల వివక్ష మరియు ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్నాడని వారు తెలిపారు.