
పయనించే సూర్యుడు జనవరి 17 హసన్ పర్తి మండలం ప్రతినిధి పోగుల రాజ్ కుమార్… ఈనెల20వతేదీనహనుమకొండలో భారీ స్థాయిలో నిర్వహించబోతున్న వేల గొంతులు, లక్షల డప్పుల సన్నాహక మహా ప్రదర్శనకు ప్రతి గ్రామం నుండి పెద్ద ఎత్తున తరలివచ్చి వేలాది డప్పులతో విజయవంతం చేయలని ఎం ఎస్ పి రాష్ట్ర నాయకులు పుట్ట రవి మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు గద్దల సుకుమార్ మాదిగ పిలుపునిచ్చారు.ఈరోజు ఉదయం హసన్ పర్తి మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట ఎం ఎస్ పి జిల్లా కార్యదర్శి రాజరపు భిక్షపతి మాదిగ ఆధ్వర్యంలో డప్పుల ప్రదర్శన నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిథులుగా పాల్గొన్న పుట్ట రవి మాదిగ ,గద్దల సుకుమార్ మాదిగల మాట్లాడుతూ ” ఎస్సీలలో ఉమ్మడి రిజర్వేషన్ విధానం అమలు కావడం వల్ల ఒక్క మాల కులం మాత్రమే అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని ,కానీ ఎస్సీ వర్గీకరణ అమలు జరిగితే ఎస్సీలలో 59 కులాలు అభివృద్ధి చెందుతారని అన్నారు.అందరికీ న్యాయం జరగడాన్ని ఓర్చుకోలేని స్వార్థపరులైన మాలలు ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తున్నారని అన్నారు. ఎస్సీ వర్గీకరణకు కేవలం ఒక్క మాల కులంలోని స్వార్థపరులె వ్యతిరేకం తప్ప సమాజం మొత్తం అంగీకరిస్తుందని అన్నారు.ఇప్పటి వరకు ఎస్సీ వర్గీకరణను ఎందుకు వ్యతిరేకిస్తున్నారో మాలలు ఒక్క శాస్త్రీయ కారణం చెప్పలేదని అన్నారు.కానీ ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలుపుతున్న బిసి, ఒసి, ఎస్టీ మైనార్టీ, మహిళా నేతలను అసభ్య పదజాలంతో దూషిస్తూ , పైశాచిక దాడులు చేయడం మాలల నీచపు మనస్తత్వనికి నిదర్శనమని అన్నారు.సమాజంలో అన్ని కులాలు అన్ని వర్గాల ప్రజలు ఎస్సీ వర్గీకరణను కోరుతున్నారని,వారిని దుషించి మాలలు సమాజంలో ఒంటరిగా మిగిలిపోవద్దని అన్నారు.సామాజిక మాధ్యమాల్లో బూతులు మాట్లాడి,అసభ్య పదజాలంతో దూషించి,అనాగరిక పద్ధతులు అవలంభించి ఎస్సీ వర్గీకరణను బలపరిచే శక్తులను అడ్డుకోలేరని అన్నారు.ఎస్సీ వర్గీకరణను బలపరుస్తున్న డా. పృథ్వీ రాజ్ యాదవ్,విమలక్క,తెలంగాణ విఠల్ ,ఇస్మాయిల్, దరువు అంజన్న, రేలారే గంగా, నల్లగొండ గద్దర్, మొదలగు నాయకులను మాదిగ జాతి గుండెల్లో పెట్టుకుంటుందని అన్నారు.వారి నిబద్ధత చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు.ఎస్సీ వర్గీకరణ అమలు కాకుండా జరుగుతున్న ఈ ఘోరమైన కుట్రలను ఎదుర్కోవడం కోసమే ఫిబ్రవరి 7 న హైదరాబాద్ లో వేల గొంతులు లక్షల డప్పుల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. దాన్ని జయప్రదం చేయడం కోసమే ఈ నెల 20 న హనుమకొండలో వేలాది డప్పులతో సన్నాహక మహా ప్రదర్శన నిర్వహిస్తున్నామని , ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు అధినేత మంద కృష్ణ మాదిగ గ,అలాగే అతిథులుగా ఎస్టీ,బీసీ, ఓసి, మైనార్టీ,ఎస్సీ కుల సంఘాల నేతలు పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి గ్రామం నుండి తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మద్దతుగా వచ్చిన కాంగ్రెస్ బీజేపీ బిఆర్ఎస్ పార్టీలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ పి రాష్ట్ర నాయకులు ఆరెపల్లి పవన్ మాదిగ,టి. ఎమ్మార్పీఎస్హ నుమకొండ జిల్లా వ్యవస్థాపక అధ్యక్షులు బొట్ల బిక్షపతి మాదిగ, బిజెపి రాష్ట్ర కౌన్సిలింగ్ మెంబర్ మారపల్లి రామ్ చంద్రారెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎల్లేష్ మాదిగ, హాసన్ పర్తి ,మాజీ సర్పంచ్ పుల్ల రవీందర్ మాదిగ, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు బోడ యుగంధర్ మాదిగ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, జన్ను రవీందర్ మాదిగ, ఎమ్మార్పీఎస్ ,మాజీ మండల అధ్యక్షులు దుర్గాప్రసాద్ మాదిగ, కళాకారుల బృందం జిల్లా నాయకులు కేత పాక మైపాల్ మాదిగ, టిఆర్ఎస్ నాయకులు చాతల్ల వేణుగోపాల్ మాదిగ, మేకల సదానందం మాదిగ, దామెర సాగర్ మాదిగ,తదితరులు పాల్గొన్నారు