పయనించే సూర్యుడు జనవరి 31 జబ్బర్ కామారెడ్డి ఇన్చార్జి.
ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ రామ్మోహన్ గారు. శ్రీ గణేష్ ఏజెన్సీ వారి నుండి నాలుగు నుండి ఐదు నెలల వేతనాలు ఇవ్వాలని వినతిపత్రం ఇచ్చిన కామారెడ్డి జిల్లా ఎఐటియుసి జిల్లా అధ్యక్షులు పి బాలరాజ్ మెడికల్ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ఎల్. దశరథ్ వారు మాట్లాడుతూ గత నాలుగైదు నెలలుగా శ్రీ గణేష్ ఏజెన్సీ వారు ఎల్లారెడ్డి ప్రభుత్వాసుపత్రిలో పనిచేస్తున్న శానిటేషన్ పేషంట్ కేర్ సెక్యూరిటీ గార్డ్ వారి వేతనాలు లేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారని అదేవిధంగా కిరాయి ఇల్లు ఉన్నటువంటి కార్మికులు చెల్లించలేక పిల్లల స్కూల్ ఫీజులు కట్టలేక నిత్యవసర సరుకులు లేక ఇల్లు గడవలేని పరిస్థితి ఉన్నదని ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే ఆసుపత్రి కార్మికులకు వేతనాలు ఇవ్వాలని అదేవిధంగా పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు ఇవ్వాలని అదేవిధంగా పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యాన్ని పకడ్బందీ అమలు చేయాలని అదేవిధంగా బకాయి ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని వారు ఎల్లారెడ్డి డివిజన్ ఆసుపత్రి అధికారి డాక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది