
ఫోటో: సమావేశంలో మాట్లాడతున్న దృశ్యం..
రుద్రూర్, మార్చ్ 28 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) : రుద్రూర్ మండల కేంద్రంలోని బీజేపీ కార్యాలయం వద్ద శుక్రవారం ఒకే దేశం ఒకే ఎన్నిక పై వర్క్ షాప్ నిర్వహించారు. పార్టీ మండల అధ్యక్షుడు ఆలపాటి హరికృష్ణ మాట్లాడుతూ.. ఒకేసారి దేశం మొత్తం ఎన్నికలు పెట్టడం వల్ల దేశ అభివృద్ధి జరుగుతుందన్నారు. భారతీయులు అందరూ కుల మత భేదాలు లేకుండా ఐక్యతగా ఉండి ఈ ఒకే దేశం ఒకే ఎన్నికను నిర్వహిస్తే దేశం అభివృద్ధి చెందిన దేశంగా ప్రపంచానికి తెలియజేయవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో శత జయంతి ఉత్సవాల కన్వీనర్ ప్రశాంత్ గౌడ్, కో కన్వీనర్ కుమ్మరి గణేష్, ప్రధాన కార్యదర్శి ఏముల గజేందర్, ఎస్సీ మోర్చా అధ్యక్షులు శివప్రసాద్, జీలకర్ర విజయ్, బోజిగొండ అనిల్, మండల కమిటీ సభ్యులు, బీజేపీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.