పయనించేసూర్యుడు, ఫిబ్రవరి 01,కాప్రా ప్రతినిధి సింగం రాజు: మల్లాపూర్ ఎలిఫెంట్ సర్కిల్ సమీపన 3 కోట్ల రూపాయలుతో ఏర్పాటు చేసినటువంటి కలర్స్ థీమ్ పార్క్ ను జిహెచ్ఎంసి మేయర్ గద్వాల విజయలక్ష్మి , డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి,ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి,మల్లాపూర్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి లతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ…కలర్స్ థీమ్ పార్క్ ఆహ్లాదకరంగా బాగుందని అన్నారు.చిన్నారులు పెద్దలు కలిసి ఉదయం సాయంత్రం వేళలో పార్కులో సేద తీర్చని అన్నారు.గ్రేటర్ హైదరాబాద్ లో కూడా అవసరమైన చోట పార్కులను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.బండారు లక్ష్మారెడ్డి లాంటి ఎమ్మెల్యే మీకు దొరకడం ఉప్పల్ నియోజకవర్గ ప్రజలకు అదృష్టమని అన్నారు. ముందుండి పనులను ఎమ్మెల్యే చేపిస్తారని ఆమె ఎమ్మెల్యేని అభినందించారు.అనంతరం ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మరెడ్డి మాట్లాడుతూ…ప్రజలు పార్కులను వినియోగించుకోవాలని సూచించారు.ఇంకా నియోజకవర్గ పరిధిలోని అవసరమైన చోట పార్కులను రోడ్లను మౌలిక వసతులను ఏర్పాటు చేస్తామని అన్నారు.అనంతరం కార్పొరేటర్ థీమ్ పార్క్ లో ఓపెన్ జిమ్,లైటింగ్ షో,వంటివి ఏర్పాటు చేయాలని మేయర్ ని పన్నాల దేవేందర్ రెడ్డి కోరారు.దీనికి మేయర్ స్పందిస్తూ అధికారులను ఆ పనులు చేపట్టాలని ఆదేశించారు.అనంతరం కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ…గతంలో ప్రస్తుతం ఉన్న పార్కులో రెండు నియోజకవర్గాలకు సంబంధించిన చెత్తను డంపింగ్ చేస్తూ ఉండేది. సూర్య నగర్ ఎస్సీ బస్తి, సుభాష్ నగర్,ఎన్ఎఫ్సీ నగర్ ఇతర కాలనీ వాసులతో పెద్దలతో కలిసి పోరాట అనంతరం ఇక్కడ పార్కును ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు.థీమ్ పార్క్ నిర్వహణ కోసం కమిటీని వేసుకొని నడిపిస్తే బాగుంటుందన్నారు. మేయర్,డిప్యూటీ మేయర్ ఎమ్మెల్యే పార్కును ప్రారంభించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మీర్పేట్ డివిజన్ కార్పొరేటర్ ప్రభుదాస్,జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్,డీసీ జగన్,ఇంజనీరింగ్ అధికారులు మల్లాపూర్ డివిజన్ వాసులు,తదితరులు పాల్గొన్నారు.
కలర్స్ థీమ్ పార్క్ ప్రారంభించిన మేయర్ గద్వాల విజయలక్ష్మి
RELATED ARTICLES