
పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ జనవరి 20 మామిడిపెల్లి లక్ష్మణ్ జగిత్యాల నియోజకవర్గం ప్రతినిధి: కల్లెడ లక్ష్మీ జ్ఞాపకార్థం, ఆమె భర్త కల్లెడ భూమయ్య మరియు కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలకు సుమారు 25 వేల రూపాయల విలువగం వాటర్ ఫ్రిడ్జ్ ను విద్యార్థుల సౌకర్యార్థము వితరణగా ఇచ్చారు. మూడువందల మంది విద్యార్థులకు లబ్ది చేకూరుతుందని కళాశాల ప్రిన్సిపాల్ రాజేష్ అన్నారు.ఈ సందర్భంగా కల్లెడ లక్ష్మి కుటుంబ సభ్యులకు ప్రిన్సిపాల్ కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో రాయికల్ మున్సిపల్ నాలుగో వార్డ్ కౌన్సిలర్ తురగ శ్రీధర్ రెడ్డి, అధ్యాపకులు చౌడారపు శ్రీనివాస్,రవీందర్,రాజమౌళి, దేవేందర్,ఉష,రజిత, కల్లెడ లక్ష్మి కుటుంబ సభ్యులు రంజిత్,అశోక్ తదితరులు పాల్గొన్నారు.