పయనించే సూర్యుడు జనవరి 30 వెంకటాపురం ప్రతినిధి బట్టా శ్రీనివాసరావు :-
కాంగ్రెస్ రుణమాఫీ మోసం పై బిఆర్ఎస్ పార్టీ ధ్వజం
*అనేక ఆంక్షలు పెట్టి రైతన్నలును మోస చేసిన ప్రభుత్వం *
*రాష్టంలో 40%శాతం మంది రైతన్నలకు కూడ రుణ మాపి కాలేదు *
* వెంకటాపురం మండల బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు, గంప.రాంబాబు.*
బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీర్ గారి పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందుఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తుందని ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ రుణ మాఫీ ఇందిరమ్మ ఇల్లు కొత్త రేషన్ కార్డు మంజూరు చేయాలని రాష్ట్రంలో 40 శాతం మంది రైతన్నలకుకూడారుణమాఫీ అందలేదని ముఖ్యమంత్రి రుణమాఫీ పూర్తయిందని మాటలు చెప్తుంటే.. మంత్రులు మనిషికో మాట చెబుతూ రైతన్నలను అయోమయానికి గురి చేస్తున్నారు.అనేక ఆంక్షలు పెట్టి రైతన్నలను మోసం చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు క్షమాపణలు చెప్పాలి గ్రామసభలో అర్హులైన రైతులందరికీ జనవరి 26న రుణమాఫీ చేస్తామన్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చేసి జనవరి 27 న మండలానికి ఒక రెవిన్యూ గ్రామానికి నాలుగు పథకాలు అమలు మాట మారసిన ప్రభుత్వం పై రైతన్నలు, ప్రజలు అగ్రం వ్యక్తం చేస్తున్నారు ఆరు గ్యారంటీ లను అమలు చేసేంతవరకు ప్రభుత్వం పైన పోరాటం ఆగదు అని తెలుపుతూ గురువారం వెంకటాపురం మండలం వేప చెట్టు సెంటర్లో గాంధీ గారి విగ్రహానికి పూలమాల లు వేసి వినతిపత్రం అందచేసి నిరసన వ్యక్తం చేసారు అనంతరం మండల రెవిన్యూ అధికారి పి లక్ష్మి రాజయ్య గార్కి వినతిపత్రం అందచేసి కలెక్టర్ పంపించాలని కోరారు కార్యక్రమం లో రైతు రుణమాఫీ కాని రైతులు మరియు బిఆర్ఎస్ పార్టీమండల ప్రసిడెంట్ గంప రాంబాబు బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గొడపర్తి నర్సింమూర్తి, వేల్పూరి లక్ష్మి నారాయణ, జాగర శాంతమూర్తి, జాగర శివాజీ,గడ్డం వివేక్ మాజీ,సర్పంచ్ లు తుర్స సూరిబాబు,పూజారి ఆదిలక్ష్మి,ఎంపీటీసీ లు జిల్లా మండల నాయకులు PACS చైర్మన్ లు సింగిల్ విండో చైర్మన్ గ్రామ శాఖ అధ్యక్షులు వార్డ్ మెంబెర్స్,BRS కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు