– మాట ఇచ్చాం,నెరవేర్చుకున్నం.
– దళిత బంధు నిధులు రాకుండా ఆపింది కౌశిక్ రెడ్డి.
– నిధుల విడుదలకు కృషిచేసిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు.
– త్వరలోనే జర్నలిస్టుల సమస్య పరిష్కారానికి కృషి చేస్తా..
– ప్రభుత్వ సంక్షేమ పథకాల పట్ల కౌశిక్ రెడ్డి ఓర్వలేకపోతున్నాడు.
పయనించే సూర్యడు //ఫిబ్రవరి //1//హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ //కుమార్ యాదవ్..: కాంగ్రెస్ ప్రభుత్వంలోనే బలహీనవర్గాలకు న్యాయం జరుగుతుందని,దళిత బంధు నిధుల విడుదల ద్వారా మరోసారి అది రుజువైందని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వొడితల ప్రణవ్ అన్నారు.శనివారం రోజున ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..రెండేళ్లు ఎమ్మెల్సీగా,ప్రభుత్వ విప్ గా ఉన్న కౌశిక్ రెడ్డి దళిత బంధు నిధులు విడుదల చేయడానికి ఎందుకు ప్రయత్నించలేదని ప్రశ్నించారు.దళితుల భావోద్వేగాలను రెచ్చగొట్టి దళితులతో దళిత బంధు రాజకీయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినట్టు దళిత బంధు నిధుల విషయంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా లబ్ధిదారులకే నిధులు వచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.కేసీఆర్,కేటీఆర్ కు దగ్గర అని చెప్పుకొని సోషల్ మీడియాలో రీల్స్ చేసుకోవడంపై ఉన్న శ్రద్ధ ప్రజల సమస్యలను పరిష్కరించడంలో లేదని,ప్రభుత్వ పథకాలపై కౌశిక్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.మార్చ్ 31 వరకు అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి సంక్షేమ పథకాలు అందిస్తామని తెలియజేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాల పట్ల కౌశిక్ రెడ్డి ఓర్వలేకపోతున్నాడని,తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ లు పెట్టడం కాదని ప్రజల వద్దకు వెళ్తే వారే కౌశిక్ రెడ్డి కి తగిన బుద్ధి చెప్తారని అన్నారు.
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి నా వంతు కృషి..: ప్రభుత్వానికి,ప్రజలకు మధ్య వారధిగా ఉండే జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి నా వంతు కృషి చేస్తానని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వొడితల ప్రణవ్ తెలిపారు.తమ సమస్యల పరిష్కారానికి పలువురు జర్నలిస్టులు ప్రణవ్ నివాసంలో కలవగా వారు తెలిపిన ప్రతి సమస్యను తెలుసుకున్న ప్రణవ్ వారి సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించారు.ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తానని తెలిపారు.