జి ఎచ్ యం సి కమిషనర్ ఇలంబద్రి చర్యలు చేపట్టాలని కల్వర్టుపైనే ఆందోళనకు దిగిన స్థానిక కుటుంబాలు.
పయనించేసూర్యడు,జనవరి 31.కాప్రా ప్రతినిధి సింగం రాజు
కాప్రా చెరువు నాలా రోజు రోజుకి కబ్జాలతో కూచించుకు పోతుందని,మురుగు నీటి ప్రవాహం తగ్గడంతో కంపు వాసనతో నాలా పరిసర కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని జిహెచ్ఎంసి, రెవెన్యూ,ఇరిగేషన్ అధికారులు చర్యలు చేపట్టాలని చర్లపల్లి కాలనీల సమాఖ్య సిసిఎస్ ప్రతినిధులు, నాయకులు డిమాండ్ చేశారు.శుక్రవారం శ్రీ చక్రిపురం సాకేత్ ప్రధాన రహదారిలో మారుతి కాలనీ బ్రిడ్జి కల్వర్టు వద్ద భవన నిర్మాణ,ప్లాస్టిక్ వ్యర్ధాలతో నాలా 30 ఫీట్ల మేర కబ్జాకు గురైన పట్టించుకునే వారే కరువయ్యారని స్థానిక కుటుంబాలు,సంక్షేమ సంఘం ప్రతినిధులు, మహిళలు ఆందోళనకు దిగారు.కాప్రా చెరువు నుంచి నాగారం చెరువు వరకు ప్రవహించే నాలా దారి పొడవున కబ్జాలకు గురవుతున్న చర్యలు చేపట్టకపోవడం సహించరాని విషయమని కుటుంబాలు బ్రిడ్జిపై నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసి కమిషనర్ ఇలంబద్రి, ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ హేమంత్ పటేల్,కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ జగన్,కాప్రా మండల తహసిల్దార్ సుచరిత,ఇరిగేషన్ అధికారులు తక్షణమే చర్యలు చేపట్టి కబ్జాకు గురవుతున్న కాప్రా చెరువు నాలాను పరిరక్షించి బాధ్యులైన వారిపై చర్యలు చేపట్టాలని చర్లపల్లి కాలనీల సమాఖ్య సిసిఎస్ అధ్యక్షులు ఎంపల్లి పద్మా రెడ్డి, నాయకులు నేమూరి మహేష్ గౌడ్,కశువజ్జల విద్యాసాగర్, సోనియా గాంధీ నగర్ మారుతి కాలనీ,గాంధీ నగర్ సంక్షేమ సంఘాల అధ్యక్షులు కనకయ్య,శ్రీనివాస్ నాయక్, పలుగుల రమణ,లంక దాసరి సుధాకర్ తదితరులు విజ్ఞప్తి చేశారు.