పయనం చే సూర్యుడు న్యూస్ జనవరి నిజామాబాద్ జిల్లా బ్యూరో టీ కే గంగాధర్
తెలంగాణ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్
లెనిన్ కృషినీ,రచనలనూ మననం చేసుకుందాం
సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు వి ప్రభాకర్ పిలుపు*
కామ్రేడ్ లెనిన్ శత వర్ధంతి ముగింపు సభ ను జయప్రదం చేయాలని, లెనిన్ కృషినీ,రచనలనూ మననం చేసుకుందాం అని
సిపిఐ ఎంఎల్ లైన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు వి ప్రభాకర్ పిలుపు* ను ఇచ్చారు.
ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ భవన్ లో మార్క్సిస్ట్ మహోపాధ్యాయుడు కామ్రేడ్ లెనిన్ శత వర్ధంతి సభ గోడ సిపిఐ ఎంఎల్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు.ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ లైన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు వి ప్రభాకర్ మాట్లాడుతు* జనవరి 21 2024 నాటికి మార్క్సిస్ట్ మహోపాధ్యాయుల లో ఒకరైన కామ్రేడ్ లెనిన్ అమరుడై వంద సంవత్సరాలు నిండుతున్నదని. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాపితంగా నెల రోజులపాటు సభలు, సిపిఐఎంఎల్ లైన్ ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించాలని, 2025 జనవరి 21న హైదరాబాద్ లో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సదస్సు ను నిర్వహిస్తున్నాం అన్నారు. తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన కృషిని తెలియజేయాలనీ, రచనలను అధ్యయనం చేయాలని, సభలు, సమావేశాలు నిర్వహించాలనీ పిలుపునిచ్చిందని అన్నారు. కామ్రేడ్ లెనిన్ విప్లవ సైద్ధాంతిక వేత్తనే కాకుండా రష్యాలో విప్లవాన్ని విజయవంతంగా తీసుకొచ్చిన విప్లవసేనాని అన్నారు. విప్లవ సిద్ధాంతాన్ని ఆచరణ, కార్యాచరణలకు తీసుకొచ్చిన విప్లవ యోధుడు కామ్రేడ్ లేని అన్నారు. ప్రపంచ విప్లవోద్యమాలకు కామ్రేడ్ లేనిన్ ఆదర్శప్రాయుడన్నారు. ఆయన స్మరించుకోవడం అంటే విప్లవ సిద్ధాంతాన్ని ఆచరణకు తీసుకుపోవడమేనన్నారు. ఈ సందర్భంగా జనవరి 21 2025 న హైదరాబాద్ లో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కామ్రేడ్ లెనిన్ శత వర్ధంతి ముగింపు సభను ఏర్పాటు చేయడం జరిగిందని. ఈ సభలో మాస్ లైన్ పార్టీ కేంద్ర, రాష్ట్ర నాయకత్వం ప్రసంగాలు ఉంటాయని అన్నారు.ఈ సభలో పార్టీ శ్రేణులు,విప్లవ అభిమానులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ పోస్టర్స్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఇల్లందు మాజీ ఎం ఎల్ ఏ. నర్సయ్య, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి బి దేవారం, జిల్లా నాయకులు ఎస్ సురేష్, కె రాజేశ్వర్, డివిజన్ నాయకులు బి కిసాన్, మండల నాయకులు అరవింద్, ఎం.నారగౌడ్, జి సాయరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.