పయనించే సూర్యుడు జనవరి 31 హసన్ పర్తి మండలం ప్రతినిధి పోగుల రాజ్ కుమార్
కిట్స్ వరంగల్ లో అత్యాధునిక సాంకేతిక అంశాల పై కార్యశాల విజయ వంతంగా నిర్వహించారు
కమల ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సింగాపురం వారు నిర్వహిస్తున్న ఆరు రోజుల అటల్ శిక్షణ భాగంగా శుక్రవారం కిట్స్ వరంగల్ ఇంజనీరింగ్ కళాశాల
ఇన్నోవేషన్ సెంటర్ ను అధ్యాపకులు వారి వి ద్యార్థులతో కలిసి కిట్స్టిఎఐ సిటి ఈ ఐడియా ల్యాబ్ ను సందర్శించారు అని కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ వరంగల్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ డాక్టర్ కె అశోక రెడ్డి తెలిపారు
ప్రయోగపూర్వకమైన వివరణ మాత్రమే విద్యార్థికి అత్యంత సులభమైన సమర్థమైన బోధన పద్ధతి అని కిట్స్ వరంగల్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగ అసిస్టెంట్ ప్రొఫెసర్ వి. రాజిరెడ్డి అన్నారు.ఈరోజు ప్రొఫెసర్ డాక్టర్ కే రాజ నరేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఏఐసీటిఈ ఐడియా ల్యాబ్ సందర్శన సమావేశంలో రాజిరెడ్డి ప్రసంగించారు. సందర్శన ముఖ్యముగా ఇంజనీరింగ్ విద్యార్థులకు పాఠ్యభాగంలో నేర్చుకున్న సాంకేతిక అంశాలను ప్రయోగశాలలో నిరూపించడం ద్వారా విద్యార్థికి సాంకేతిక అవగాహన పెరుగుతుందని తద్వారా విద్యార్థి ఒక సాంకేతిక అంశాన్ని వివిధ రూపాలలో ఆచరణలోకి తీగలరని రాజిరెడ్డి వివరించారు.కమల ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సింగాపురం వారు నిర్వహిస్తున్న ఆరు రోజుల అటల్ శిక్షణ భాగంగా శుక్రవారం వరంగల్ కిట్స్ ఇంజనీరింగ్ కళాశాల
ఇన్నోవేషన్ సెంటర్ ను అధ్యాపకులు,విద్యార్థులు ఏఐసిటిఈ ఐడియా ల్యాబ్ ను సందర్శించారు.
ఈసంధర్భంగా ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ డాక్టర్ అశోక్ రెడ్డి మాట్లాడుతూ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 లో ప్రయోగాత్మక బోధనకు ప్రాధాన్యత ఇస్తున్నారని వివరించారు.ఈ ప్రో గ్రామ్ లో దాపు 60 మంది సాంకేతిక అధ్యాపకులు పాల్గొన్నారు. ఐడియా ల్యాబ్ లోని ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్3డి ప్రింటింగ్, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్,రోబోటిక్స్,డి జిటల్ మ్యానుఫ్యాక్చరింగ్ మొదలగు విభాగాలను అధ్యాపకులు సందర్శించారు.అత్యాధునిక సాంకేతిక అంశాల పై అవగ్హన కల్పించారు.
ఈ కార్యక్రమంలో కార్య శాల సమన్వయకర్త డాక్టర్.జి మల్లయ్య, సహసమన్వయకర్త డాక్టర్.ఎస్.రాజేంద్రప్రసాద్ కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ వరంగల్ అధ్యాపకులు డి.కుమార్ , డాక్టర్ ఏ.దేవరాజు,కే. కిషోర్ కుమార్ ,డాక్టర్ ఎం.డి.సమీర్, డాక్టర్ రమేష్ డాక్టర్ చంద్రమౌళి,డా లక్ష్మణ్ లు, అసోసియేట్ ప్రొఫెసర్ అండ్ పి ఆర్ ఓ డా డి.ప్రభాకరా చారి పాల్గోన్నారు.