

పయనించే సూర్యుడు జనవరి 18 (ఆత్మకూరు నియోజకవర్గం ప్రతినిధి)… సమగ్ర శిశు సంక్షేమ శాఖ ఆత్మకూరు ప్రాజెక్ట్ ఐసిడిఎస్. సిడిపిఓ ఆత్మకూరు పరిధిలోని చేజర్ల మండలంలో కిషోర్ వికాసము మండల స్థాయిలో శిక్షణ కార్యక్రమమును సిడిపిఓ సునీలత పర్యవేక్షణలో శనివారం చేజర్ల మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో సమావేశ న నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎంపీడీవో విజయ లలిత డిప్యూటీ తాసిల్దారు మస్తానయ్య చేజర్ల మెడికల్ ఆఫీసర్ మెహతాబ్ చిత్తలూరు పిహెచ్ఎన్ విమల కుమారి ఎంఈఓ డి మస్తానయ్య వన్ స్టాప్ సెంటర్ నుంచి లీగల్ అడ్వైజర్ ప్రశాంతి కేస్ వర్కర్ సాధన . అంగనవాడి సెక్టార్ సూపర్వైజర్ సిహెచ్ సురేఖ, రమాదేవి,అంగనవాడి టీచర్స్ పాల్గొన్నారు ఈ శిక్షణ కార్యక్రమంలో ఎమ్మెస్కేలు ఏఎన్ఎమ్సు వెల్ఫేర్ అసిస్టెంట్ మరియు అంగన్వాడీ కార్యకర్తలు గవర్నమెంట్ టీచర్స్ ఈ కిషోరి వికాసం అనే శిక్షణలో పాల్గొనడం జరిగింది.ఐసిడిఎస్ సిడిపిఓ సునీలత మాట్లాడుతూ దేశ జనాభాలో11-18 సంవత్సరముల వయసుగల కిషోర్ ఈ బాలబాలికలు 20 % ఉన్నారని వారికి తగిన అవగాహన లేక ఇబ్బందులకు గురి అవుతున్నారని అందువలన వారిలో చైతన్యం పెంపొందించి విద్యావంతులుగా. ఆరోగ్యవంతులుగా. ఉంటూ తగిన భద్రత పొందగలరన్న లక్ష్యంగా ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం రూపొందించింది అని అన్నారు శిక్షణ పొందిన వారు గ్రామ మండల స్థాయిలో 18 సంవత్సరాల లోపు వారందరికీ తగిన అవగాహన కల్పించాలని వారు సూచించారు. మొదటగా ఎంపీడీవో విజయ లలిత కిషోర్ వికాసంయొక్కప్రాముఖ్యతను తెలియపరిచారు సఖి వన్ స్టాప్ సెంటర్ లీగల్ అడ్వైజర్ ఎన్ ప్రశాంతి బాలవివాహాల నిరోధక చట్టం 2006 . మహిళలకు మరియు పిల్లలకు అందుబాటులో చైల్డ్ అండ్ ఉమెన్ హెల్ప్ లైన్ నెంబర్స్ గురించి, 1098,181,112 ఉన్న చట్టపరమైన రక్షణలో మరి సహాయ వ్యవస్థలపై కిషోరి వికాసం గురించి అవగాహన కల్పించారు.తదుపరి కేస్ వర్కర్ జి సాధన నాణ్యమైన విద్య నైపుణ్య ఉపాధి సంపూర్ణ ఆహారం ఆరోగ్యము లింగ వివక్షత కామార దశలో ఎదుర్కొంటున్న సమస్యలు వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో అంగన్వాడి కార్యకర్తలు ఆరోగ్య సిబ్బంది పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు