పయనించేసూర్యుడు,జనవరి 16,కాప్రా ప్రతినిధి సింగం రాజు:చర్లపల్లి డివిజన్ పరిధిలోని పారిశ్రామిక ఏరియాలో రోటరీ క్లబ్ కంపెనీ లో ప్రముఖ పారిశ్రామిక వేత్త బబ్బురి బాలరాజు గౌడ్.ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి.చేతుల మీదుగా 20 మంది మహిళల కు కుట్టు మిషన్ లు పంపిణీ చేయడం జరిగింది.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రోటరీ క్లబ్ వారికి అభినందనలు తెలిపారు.మహిళకు ఎంతగానో ఉపయోగపడుతోంది అని ఆయన అన్నారు.ఇలాంటి కార్యక్రమాలు మునుముందు కొనసాగించాలని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో హెచ్ బి కాలనీ కార్పొరేటర్ ప్రభుదాస్, మల్లాపూర్ కార్పొరేటర్,పన్నాల దేవేందర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు కొత్త రామారావు,శ్రీనివాస్ రెడ్డి,బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎన్.మహేష్ గౌడ్. బొడిగె రాజుగౌడ్,కాసం మైపాల్ రెడ్డి,సార అనిల్, చక్రపాణి గౌడ్.శ్రీకాంత్ రెడ్డి, ఎస్ ఏ రహీం,మల్లేష్, కనకయ్య,ప్రమోద్,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
కుట్టు మిషన్ లు పంపిణీ చేసిన ఉప్పల్ ఎమ్మెల్యే
RELATED ARTICLES