Sunday, May 11, 2025
Homeతెలంగాణకేంద్రం ప్రవేశపెట్టనున్న వార్షిక బడ్జెట్లో వ్యవసాయ రంగానికి అధిక నిధులు కేటాయించాలి.

కేంద్రం ప్రవేశపెట్టనున్న వార్షిక బడ్జెట్లో వ్యవసాయ రంగానికి అధిక నిధులు కేటాయించాలి.

Listen to this article

పయనించే సూర్యుడు జనవరి29. పాల్వంచ టౌన్ ప్రతినిధి గడ్డం నరహరి. పాల్వంచ రూరల్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలోని పలు గ్రామాల్లో సిపిఐ నాయకుల బృందం పర్యటన .మండలం లోని కెపి జగన్నాధపురం, నాగారం కాలనీ, రంగాపురం, నాగారం, నారాయణరావు పేట, సంగం గట్టు గ్రామాలలో ఈరోజు సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్. కే.సాబీర్ పాషా నేతృత్వంలో నాయకుల బృందం పర్యటించి పార్టీ ముఖ్య కార్యకర్తలతో, గ్రామాల ప్రజలతో జనరల్ బాడీ సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సాబీర్ పాషా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి నెలలో ప్రవేశపెట్టనున్న వార్షిక బడ్జెట్ 2025లో వ్యవసాయ రంగానికి అధిక నిధులు కేటాయించాలని, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి అధిక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. జిల్లా ప్రజల చిరకాల కోరికలైన కొవ్వూరు రైల్వే లైన్, మైనింగ్ యూనివర్సిటీ, ఎరువుల కర్మాగారం ఏర్పాటుకు నిధులు కేటాయించాలని కోరారు. ప్రజా వ్యతిరేక విధానాల అవలంబిస్తూ రైతు వ్యతిరేక చట్టాలను తెచ్చి భారత వ్యవసాయ రంగాన్ని నిలువునా కుదేలు చేయుటకు, బడా పారిశ్రామిక వేత్తలకు ప్రజల భూములను, ఆస్తులను అప్పనంగా దోసి పెట్టేందుకు కేంద్రంలోని నరేంద్ర మోడీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం కుట్ర పన్నుతున్నదని అందులో భాగంగానే రైతు వ్యతిరేక మూడు నల్ల చట్టాలను తెచ్చిందని ఆ చట్టాలు రద్దు చేయాలని భారతదేశంలో కనీవినీ ఎరుగని రీతిలో రెండు సంవత్సరాల పాటు లక్షలాది మంది రైతులు ఢిల్లీలో గొప్ప పోరాటం నిర్వహించారని ఆ పోరాటానికి భయపడ్డ మోడీ కొంచెం వెనక్కి తగ్గాడని మళ్లీ ఆ చట్టాలను తెచ్చి భారత రైతాంగాన్ని నష్టపరిచేందుకు నరేంద్ర మోడీ సిద్ధమవుతున్న తరుణంలో జగ్జీత్ సింగ్ ధలై వాల్ అనే రైతు ఢిల్లీలో 60, 70 రోజుల నుండి అమరణ నిరాహార దీక్ష చేస్తున్నాడని. ఆ రైతు నేడు ప్రాణాప్యాయ స్థితిలో ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా పథకాలు అందజేయాలని లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన ప్రజా పాలన గ్రామసభల్లో అర్హులైన వారు (లిస్టులో పేర్లు రాని వారు) వెంటనే దరఖాస్తు చేసుకోవాలని. అర్హులైన పేదలకు ఆ పథకాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా స్థానిక శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు పనిచేస్తున్నారని, సంక్షేమ పథకాలు అందించే విషయంలో ఎటువంటి రాజకీయాలకు చోటు లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు ముత్యాల విశ్వనాథం, పాల్వంచ మండల కార్యదర్శి వీసంశెట్టి పూర్ణచంద్రరావు, జిల్లా సమితి సభ్యులు ఉప్పుశెట్టి రాహుల్, గుండాల నాగరాజు, నాయకులు నిమ్మల రాంబాబు, వీసంశెట్టి విశ్వేశ్వర రావు, మన్యం వెంకన్న, జక్కరయ్య, వైయస్ గిరి, జర్పుల మోహన్ ,లావుడియా చందూలాల్, రాందాస్, వెంకటరమణ, శుంకర రంగారావు, హరి, హత్తి రామ్, బానోతు రంజిత్, రవి, చెంచలపురి శ్రీను, సాయిలు శ్రీను, మేక రాంబాబు, బత్తుల గోపాలకృష్ణ, బాదావత్ శీను* తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments