
పయనించే సూర్యుడు ఫిబ్రవరి 4
మంచిర్యాల్ జిల్లా మంచిర్యాల్ మండల్
రిపోర్టర్ (గొడుగు ఆశీర్ విల్సన్)
టిపిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ పిలుపు మేరకు..
మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆదేశాల మేరకు
కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ పట్ల చూపిన వివక్షకు నిర్వహిస్తూ మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తా లో మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆధ్వర్యంలో భారీ ధర్నా చేపట్టారు.
ఈ సందర్భంగా జిల్లా డీసీసీ అధ్యక్షురాలు సురేఖ మాట్లాడుతూ తెలంగాణ పైన కేంద్ర ప్రభుత్వం విద్వేషం చూపుతుంది. అని అన్నారు తెలంగాణ బీజేపీ ఎంపీలు ఇప్పటికైనా గొంతు ఎత్తాలి తెలంగాణకు జరిగే అన్యాయం గురించి కేంద్ర ప్రభుత్వానికి తెలపాలని కోరారు
ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ నాయకులు, మహిళా నాయకురాల్లు యువజన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు..