
03-02-2025
పయనించే సూర్యుడు పరకాల ప్రతినిధి గొట్టే రమేష్
కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ నిధుల కేటాయింపులో మొండి చేయి, కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ సోమవారం పరకాల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుండి బస్టాండ్ మీదుగా అంబేద్కర్ సెంటర్ వరకు నిరసన కార్యక్రమం లో ఎమ్మెల్యే శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి మరియు టి పి సి సి ఉపాధ్యక్షుడు దొమ్మాటి సాంబయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేవలం రాజకీయ లబ్ధి తోనే రాష్ట్రాలను నిర్లక్ష్యం చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ కేటాయింపులను రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. రాష్ట్ర వనరుల నుండి వచ్చే ఆదాయం 60 శాతం బడ్జెట్ చేయాలి దానికి విరుద్ధంగా 6% కూడా ఇవ్వడం లేదన్నారు. దేశాన్ని పాలించే సత్తా కాంగ్రెస్ పార్టీకే ఉందని కులగనునకు వ్యతిరేకంగా బిజెపి వ్యతిరేకిస్తుందని అన్నారు. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లు అని పేరు ఉంటే కేంద్ర నిధులు ఇవ్వదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అంటున్నారని అన్నారు. ఈ సందర్భంగా టిపిసిసి ఉపాధ్యక్షుడు దొమ్మాటి సాంబయ్య మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వస్తే సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, గత పది సంవత్సరాల నుండి నిరుద్యోగులను మోసపుచ్చుతూ కాలయాపన చేస్తున్నారని బిజెపిని దూయబట్టారు. టిఆర్ఎస్ 10 సంవత్సరాలలో 7 లక్షల కోట్లు అప్పు చేసి ప్రజల నెత్తిన భారం మోపిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పరకాల పట్టణ అధ్యక్షుడు కొయ్యడ శ్రీనివాస్ మండల అధ్యక్షుడు కటుకూరి దేవేందర్ రెడ్డి నడి కూడా మండల అధ్యక్షుడు బుర్ర దేవేందర్ గౌడ్ మరియు పరకాల నియోజకవర్గ మండల అధ్యక్షులు పార్టీ సీనియర్ నాయకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.