ఢిల్లీ: మాజీ మంత్రి కేటీఆర్ జైలుకు పోతానని చెప్పారు కదా ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. దేనికైనా సిద్ధమని కేటీఆర్ చెప్పారు కదా ఇప్పుడేందుకు ఇలా చేస్తున్నారన్నారు. కేటీఆర్ నిజంగానే డ్రామారావులా వ్యవహారిస్తున్నారని ఎద్దేవా చేశారు. మంత్రిగా చేసి జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేటీఆర్, కేసీఆర్ డబ్బులను ఇష్టారీతిగా ట్రాన్స్‌ఫర్ చేశాడు, దానినే విచారణ అధికారులు ఆడుగుతున్నారని అన్నారు. వాటికి సమాధానం చెప్పకుండా కేటీఆర్ డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు. జీవితాంతం అధికారంలో ఉంటామని కేటీఆర్ భావించారని చెప్పారు. ముఖ్యమంత్రి వస్తే మంత్రులు లేవలేదని సోషల్ మీడియా ద్వారా చిల్లర కామెంట్లు చేస్తున్నారన్నారు. కేసీఆర్ లాగా రేవంత్‌రెడ్డి కాళ్లు పట్టించుకోరని చెప్పారు. సీఎం అంటే రాష్టానికి ఓనర్ కాదని తెలిపారు. కేటీఆర్‌ను రాజకీయ నాయకుడిగా చూడటం బంద్ చేయాలన్నారు. రూ. 85 వేల కోట్లు పదేళ్లలో ఖర్చు చేస్తే తాము ఒక్క ఏడాదిలోనే రూ.53 వేల కోట్లకు పైగా ఖర్చు చేశామని గుర్తుచేశారు.