
పయనించే సూర్యుడు జనవరి 20 హసన్ పర్తి మండలం ప్రతినిధి పోగుల రాజ్ కుమార్… కేటీఆర్ సేన రాష్ట్ర అధ్యక్షులు మెoగని మనోహర్ ఆదేశాల మేరకు వరంగల్ జిల్లా అధ్యక్షులు మైనాల నరేష్ వర్ధన్నపేట నియోజకవర్గంకి చెందిన నాయకులు చిర్ర సుమన్ గౌడ్ ని వర్ధన్నపేట నియోజకవర్గ ఇన్చార్జి గా నియమిస్తూ నియామక పత్రాన్ని అందజేయడం జరిగింది. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ అధినేత కేసిఆర్ నాయకత్వంలో పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లాలని కేటీఆర్ సేన వరంగల్ జిల్లా అధ్యక్షులు మైనాల నరేష్ సూచించారు తెలంగాణ రాష్ట్రానికి కెసిఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అని వెల్లడించారు. చిర్ర సుమన్ మాట్లాడుతూ నా నియామకానికి సహకరించిన రాష్ట్ర అధ్యక్షులు మెంగని మనోహర్ కు, జిల్లా అధ్యక్షులు మైనాల నరేష్ కు ధన్యవాదములు తెలిపారు