
పయనించే సూర్యడు // మార్చ్ // 31 // కుమార్ యాదవ్ (హుజురాబాద్)..హుజురాబాద్ నియోజకవర్గం వీణవంక మండలం కొండపాక గ్రామంలో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఉగాది ఆదివారం రోజున పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. మహిళలు బోనమెత్తుకొని డప్పు సప్పులతో ఊరోగింపుగా వచ్చి పోచమ్మ ఆలయానికి చేరుకున్నారు. అనంతరం భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి డప్పు సప్పులతో బోనాల సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం పెద్దలు మరియు సంఘం సభ్యులు అందరూ పాల్గొన్నారు.