
పయనించే సూర్యుడు. ఫిబ్రవరి 03. ఖమ్మం జిల్లా బ్యూరో ఇంచార్జ్ గుగులోత్ భావుసింగ్ నాయక్
ఏన్కూరు మండలం జన్నారం గ్రామంలో కోడిపందాలు స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు అందులో భాగంగ25వేల నగదు, 18 ద్విచక్ర వాహనాలు స్వాధీనం. చేసుకున్నారు
ఆరుగురు వ్యక్తులపై కేసు నమోదు. కోడిపందాల స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించిన సంఘటన ఇది. మండల పరిధిలోని జన్నారం గ్రామ సమీపంలో కోడిపందాలు ఆడుతున్న విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆదివారం రాత్రి దాడులు నిర్వహించారు. దాడులు నిర్వహించగా కొందరు వ్యక్తులు పరారయ్యారు. దాడుల్లో ఆరుగురు వ్యక్తులు,సుమారు 25వేల 160రూపాల నగదు, 18 ద్విచక్ర వాహనాలు, కత్తులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాహనాలను పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఏన్కూర్ ఎస్సై రఫీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.