
స్టేషన్ కు వెళ్తే పోలీసులు ఎలా వ్యవహరిస్తారు ఏ సేవలో జాప్యం జరుగుతోంది..ఏవైనా సమస్యలు ఉంటే డిజిటల్ రూపంలో అభిప్రాయం చెప్పేందుకు పోలీసు ఉన్నతాధికారులు క్యూఆర్ కోడ్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. అధికారుల సూచన మేరకు జీడిమెట్ల స్టేషన్ ఇన్స్పెక్టర్ గడ్డం మల్లేష్ క్యూఆర్ కోడు విధానం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. స్మార్ట్ ఫోన్ ద్వారా క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి పోలీసుల వ్యవహార శైలి, సేవలపై అభిప్రాయాన్ని వ్యక్తం చేయాల్సి ఉంటుంది. స్టేషన్ లో గోడ పై ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే వెంటనే గూగుల్ లో ఓ అప్లికేషన్ ఫామ్ తెరుచుకుంటుంది అందులో తెలుగు ఇంగ్లీష్ భాషల్లో నమోదు చేసేందుకు అవకాశం కల్పించారు. ముందు భాషను ఎంపిక చేసుకోవాలి తర్వాత పేరు జెండర్ ఎంచుకోవాల్సి ఉంటుంది ఫోన్ నెంబర్ను నమోదు చేయాలి ఏ విషయంపై అభిప్రాయాన్ని వ్యక్తం చేయాల్సి ఉంటుందో ఆ ఆప్షన్ను ఎంచుకోవాలి అందులో పిటిషన్, ఎఫ్ ఐ ఆర్, ఈ చలానా పాస్పోర్టు ధ్రువీకరణ, ఇతర సేవలు ఉంటాయి. ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత సైబరాబాద్ కమిషనరేట్ ఎంపిక చేసుకుంటే ఆ కమిషనరేట్ లో ఉన్న స్టేషన్ లు ప్రత్యక్షమవుతాయి. అందులో పోలీసు స్టేషన్ ఎంపిక చేసుకోవాలి అనంతరం 100 పదాల్లో అభిప్రాయాన్ని వివరించాలని సూచిస్తుంది ఈ అభిప్రాయంపై మిమ్మల్ని సంప్రదించవచ్చా లేదా అనే ఆప్షన్ కూడా ఉంది అవసరమైతే ఎంచుకోవాలి. ఇలా చేస్తే అభిప్రాయాన్ని విజయవంతంగా డిజిటల్ రూపంలో తెలియజేయవచ్చని ఇన్స్పెక్టర్ మల్లేష్ తెలిపారు.