నందిగామ మండలం మొదల్లగూడ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్
టోర్నమెంట్ను ప్రారంభించిన ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ రెడ్డి
టోర్నమెంట్ లో పాల్గొంటున్న పలు జట్లు
( పయనించే సూర్యుడు జనవరి 14 కొత్తూరు రిపోర్టర్ విస్లావత్ పిరు నాయక్ )
క్రీడల వల్ల క్రీడాకారులకు మానసిక ఉల్లాసంతో పాటు, శారీరిక ఆశ్రమ పెరిగి ఆరోగ్యంగా ఉంటారని ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ రెడ్డి అన్నారు. నందిగామ మండలం మొదల్లగూడలో మొదల్లగూడ ప్రీమియర్ క్రికెట్ లీగ్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్సీ నగర్ కుంట నవీన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆయనను సాదరంగా ఆహ్వానించి సత్కరించారు. అనంతరము ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ రెడ్డి మొదల్లగూడ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రికెట్ ఒక అత్యుత్తమమైన క్రీడ అని, భారతదేశం యొక్క పేరు ప్రతిష్టలను ప్రపంచవ్యాప్తంగా నిలిపింది క్రికెట్ ఆట అని అన్నారు. ప్రీమియర్ లీగ్ క్రికెట్ లో పాల్గొంటున్న క్రీడాకారులందరూ తమ అత్యద్భుతమైన ప్రతిభను కనబరిచి, క్రికెట్ ఆట లో బాగా కష్టపడి రాష్ట్రస్థాయి నుండి జాతీయ స్థాయి వరకు ఎదగాలని క్రీడాకారులకు సూచించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ క్రికెట్ ఆడటం వల్ల ఆటలో ఉరుకుల పరుగుల వలన శారీరక దృఢత్వం పెరిగి క్రీడాకారులందరూ బలంగా తయారవుతారని, తద్వారా క్రీడాకారులకు మానసిక ప్రశాంతత లభిస్తుందని, ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొనే శక్తి వస్తుందని, చదువుతోపాటు క్రీడల వల్ల జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుందని, మంచి మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుందని అందుకే క్రీడాకారులు అందరూ క్రీడలపై ప్రేమ పెంచుకొని వాటిని తమ జీవితంలో ఒక భాగంగా మలుచుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మామిడిపల్లి మాజీ ఎంపిటిసి కట్న మాధవి రవీందర్, వార్డ్ మెంబర్స్ అబ్బాస్ శ్రీను, శ్రీరామ్ మరియు రామచంద్రయ్య, రమేష్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, ఆంజనేయులు గౌడ్, కుమ్మరి క్రిష్ణ మరియు క్రీడాకారులు పాల్గొన్నారు.