
డాక్టర్ విష్ణు
పయనించే సూర్యుడు టేకులపల్లి ప్రతినిధి పోనకంటి ఉపేందర్ రావు… భారతదేశంలో ప్రజల సామాజిక ఆర్థిక స్థితిగతులను తీవ్రంగా ప్రభావితం చేస్తున్న క్షయ వ్యాధిని పూర్తిగా నిర్మూలించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంలో నిర్వహిస్తున్న 100 రోజుల ముమ్మర కృషి కార్యక్రమం నిక్షయ్ షివిర్ లో భాగంగా మంగళవారం సులానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ కందుల దినేష్ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ ఆరోగ్యమందిర్. బద్దు తండా ఆరోగ్య ఉప కేంద్రం పరిధిలోని బద్దు తండా, నంద్యాతండా, మద్దిరాల గుంపు , అబ్బిరెడ్డిగూడెం, తుమ్మలచెలక, అందుగులగూడెం, కుంటల్ల, ఆదివాసి గిరిజన గ్రామాల ప్రజలకు క్షయ వ్యాధి పై పూర్తి అవగాహన కల్పించి అనుమానితులను పరీక్షించి వ్యాధి నిర్ధారణ చేయడానికి ఇక్కడే ఖరీదైన డిజిటల్ ఎక్సరే పరీక్షలు చేసి సి బి నాట్ పరీక్ష కొరకు తెమడ శాంపిల్ సేకరణ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ క్షయ నివారణ విభాగ అధికారి డాక్టర్ విష్ణు జిల్లా క్షయ నివారణాధికారి డాక్టర్ బాలాజీ నాయక్ తో కలిసి కార్యక్రమం జరుగుతున్న తీరుతెన్నులను పరిశీలించారు. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన క్షయ వ్యాధి తీవ్రంగా ఉన్న 347 జిల్లాల్లో తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిది జిల్లాలు ఉన్నాయని అందులో మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఒకటి అని కాబట్టి క్షయ వ్యాధిపై సమాజంలోని ప్రతి ఒక్కరూ చర్చించుకుని అవగాహన పెంచుకొని దానిని పూర్తిగా నిర్మూలించడంలో సహకరించాలని ఈ సందర్భంగా కోరారు.
వ్యాధి లక్షణాలు అయిన 15 రోజులకు మించి దగ్గు, జ్వరం ఆకలి లేకపోవడం బరువు తగ్గిపోవడం, ఆయాసం, అలసట, తెమడలో రక్తం పడటం , మెడ చుట్టూ చంకలో గజ్జల్లో గడ్డలు వంటి ప్రధాన లక్షణాలు ఉన్నవారు గతంలో క్షయ వ్యాధికి మందుల వాడిన వారు మరియు వారి కుటుంబ సభ్యులు దీర్ఘకాలిక వ్యాధులకు మందులు వాడుతున్న వారు 60 సంవత్సరాలు పైబడిన వారు ఈ వందరోజుల నిక్షయ్ షివిర్ కార్యక్రమంలో పాల్గొని ఉచిత క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకుని నిర్ధారణ జరిగితే ప్రభుత్వం ఇచ్చే నాణ్యమైన మందులతో వ్యాధిని తగ్గించుకొని తద్వారా మరణాన్ని నివారించుకోవడంతోపాటు కుటుంబ సభ్యులకు మరియు సమాజంలోని ఇతరులకు క్షయ వ్యాధి వ్యాప్తిని నివారించవచ్చని ఈ వ్యాప్తిని భారత సమాజం నుంచి పూర్తిగా నిర్మూలించడం సాధ్యపడుతుందని అన్నారు.
క్షయ వ్యాధికి మందులు వాడే ప్రతి వ్యాధిగ్రస్తుడికి వ్యాధి తగ్గేవరకు నిరంతర సూచనలు సలహాలు ఇవ్వడంతో పాటు పోషకాహార నిమిత్తం మందులు వాడే కాలానికి ప్రతి నెల 1000 రూపాయలు పేషంట్ బ్యాంక్ ఖాతా లో వేయడం జరుగుతుంది అని పై సౌకర్యాలు ప్రైవేట్ దవాఖానాలో లభించవు మరియు చాలా ఖర్చుతో కూడుకున్నవి కాబట్టి ప్రభుత్వ వైద్యశాలలో లభించే పై ఉచిత సేవలను ఉపయోగించుకొని క్షయ వ్యాధిని అంతమొందించడంలో ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో వైద్యాధికారి వెంకటేష్ రేడియాలజిస్ట్, లహరి, టీబి అలర్ట్ ఇండియా నుండి వెంకటేశ్వర్లు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ వజ్జా పార్వతి , పబ్లిక్ హెల్త్ నర్స్ ఆఫీసర్ చంద్రకళ, సూపర్వైజర్లు గుజ్జ విజయ, కౌసల్య సింగ్ , పోరండ్ల శ్రీనివాస్, నాగుబండి వెంకటేశ్వర్లు , మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ ధరణి, ఏఎన్ఎం స్వప్న, క్షయ వ్యాధి నివారణ ఇల్లందు డివిజన్ అధికారులు కృష్ణవేణి, శిరీషా, శంకర్ సర్వన్, పంచాయతీ కార్యదర్శి మహేందర్, గ్రామ పెద్దలు హార్జా నాయక్,చిన్ని, ఖీర్యా తదితరులు పాల్గొన్నారు.