
పయనించే సూర్యుడు. ఫిబ్రవరి 19. ఖమ్మం జిల్లా బ్యూరో ఇంచార్జ్.గుగులోత్ భావుసింగ్ నాయక్ :తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు ఏన్కూరు:- ఖమ్మం లో మిర్చి బోర్డు ఏర్పాటు కు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక చొరవ చూపాలి అని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు అన్నారు. బుధవారం ఏన్కూరు మిర్చి మార్కెట్ ను తెలంగాణ రైతు సంఘం బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా బొంతు రాంబాబు మాట్లాడుతూ మిర్చి రైతులకు వైరస్, తెగుళ్లు, నల్లి మూలంగా నష్టం జరిగింది అని మరోవైపు మార్కెట్లో సరైన ధర లేకపోవడంతో తీవ్రంగా నష్ట పోతున్నారు అని అన్నారు. అంతర్జాతీయ ఎగుమతులు పై ఆధారపడి మిర్చి సాగు చేయాల్సి వచ్చిన నేపథ్యంలో అంతర్జాతీయ ఎగుమతులు ఎగుడు దిగుడు పై రైతులకు సరైన అవగాహన లేకపోవడం, నూతన వైరస్, తెగుళ్లు, వాతావరణ మార్పులు మూలం గా సంభవిస్తున్న నష్టం , సరైన విత్తనాలు ఎరువులు పురుగు మందులు ధరల నియంత్రణ లేకపోవడం రైతులను బలితీసుకుంటున్న పరిస్థితుల్లో సమగ్ర మిర్చి సాగు విధానం రూపొందించాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పైన ఉంది అన్నారు, మిర్చి పంట ను ఆహార పంట గా కేంద్ర ప్రభుత్వం గుర్తించి కేంద్ర ప్రభుత్వం ప్రకటించే వ్యవసాయ ఉత్పత్తుల మద్దతు ధరల పంటల జాబితాలో మిర్చి పంట చేర్చి కింటాకు ఇరవై ఐదు వేల రూపాయలు మద్దతు ధర నిర్ణయించి కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు నా ఫెడ్, మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని కోరారు, ఖమ్మం లో మిర్చి బోర్డు ఏర్పాటు చేయాలి అని, మిర్చి క్వింటాళ్ల కు ఇరవై ఐదు వేల రూపాయలు మద్దతు ధర నిర్ణయించి ప్రభుత్వం కొనుగోలు చేయాలనే డిమాండ్స్ జిల్లా మంత్రులు స్పష్టమైన వైఖరి బహిరంగ పర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం ఏన్కూరు మండల కార్య దర్శి దొంతిబోయిన నాగేశ్వరరావు, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు భూక్యా లక్ష్మా, నెల్లపట్ల వెంకటేశ్వరరావు,డి వెంకటేష్, పి వెంకన్న రైతులు పాల్గొన్నారు