
ఓ పౌల్ట్రీఫామ్ లో మూడ్రోజుల్లో 11వేల కోళ్లు మృతి.పయనించే సూర్యుడు ఎన్టీఆర్ జిల్లా తిరువూరు డివిజన్ ప్రతినిధి బొర్రా శ్రీనివాసరావు : ఇప్పటికే రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో బర్డ్ ఫ్లూ కారణంగా లక్షలాది కోళ్లు చనిపోయిన వైనం.బర్డ్ ఫ్లూ వచ్చిన ప్రాంతాల్లోని పౌల్ట్రీలు,చికెన్ షాపులు,కోళ్లు, గుడ్లను పుడ్చేయాలని అక్కడి అధికారుల ఆదేశాలు. కొన్ని రోజులపాటు చికెన్ కు దూరంగా ఉండాలని సూచిస్తున్న అధికారులు.కానీ తిరువూరు పరిసర ప్రాంతాల్లో 15రోజుల నుండి ఇప్పటికే కొన్ని పౌల్ట్రీఫారాలలో మృత్యువాత పడిన వేలాది కోళ్లు. లక్షల్లాది రూపాయల పెట్టుబడుపెట్టి క్షణాల్లో కళ్ళముందే కోళ్లు చనిపోవడంతో తీవ్ర ఆందోళన చెందుతున్న పౌల్ట్రీ నిర్వాహకులు.