
తీన్మార్ మల్లన్న రాష్ట్ర కమిటీ సభ్యులు ఆచ్చునూరి కిషన్
పయనించే సూర్యుడు: ఫిబ్రవరి 14: ములుగు జిల్లా వాజేడు మండల ప్రతినిధి. రామ్మూర్తి. ఎ. ములుగు:శుక్రవారం ములుగు జిల్లా కేంద్రానికి విచ్చేసిన వాడ బలిజ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డర్ర దామోదర్ కి ఘనంగా స్వాగతం పలికి జిల్లా కేంద్రంలోని గట్టమ్మ తల్లి’ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి దర్శనం చేయించిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న టీమ్ రాష్ట్ర కమిటీ సభ్యుడు, ములుగు జిల్లా ఇంచార్జీ అచ్చునూరి కిషన్.ఈ సందర్భంగా వాడ బలిజ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డర్ర దామోదర్ మాట్లాడుతూ.. స్వాగతం పలికినా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న టీమ్ రాష్ట్ర కమిటీ సభ్యుడు కిషన్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ… ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేస్తున్న బీసీ రాజ్యాధికార ఉద్యమానికి వాడ బలిజ సేవా సంఘం సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని, అలాగే రాష్ట్రంలో 2 లక్షల పై చిలుకు ఉన్నా వాడ బలిజ మా జనాభాను ప్రభుత్వం గుర్తించి మాకు న్యాయం చేయాలని కోరారు. రానున్న బీసీ ఉద్యమంలో వాడ బలిజ కులస్తులు ముందు వరుసలో ఉంటారని తెలిపారు.