
ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.
పయనించే సూర్యుడు: జనవరి19: ములుగు జిల్లా వాజేడు మండల రామ్మూర్తి.ఎ… వాజేడు; ములుగు జిల్లాలో జనవరి 26న నిర్వహించే గణతంత్ర దినోత్సవ వేడుకలకు అంగరంగ వైభవంగా అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. అధికారులను ఆదేశించారు.
శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ శబరిష్, ఐటిడిఏ పిఓ చిత్రా మిశ్రా,డిఎఫ్ఓ రాహూల్ కిషన్ జాదవ్,ఆర్ డి ఓ వెంకటేష్ లతో కలసి జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్. వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించాలని వాటికి సంబంధించిన సందేశాలను, స్టాల్స్ ను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ వేడుకలను తంగేడు మైదానంలో నిర్వహించాలని నిర్వహణకు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో డి ఎం అండ్ హెచ్ ఓ గోపాలరావు, డి పి ఓ దేవ్ రాజ్, సి పి ఓ ప్రకాష్, డిసి ఎస్ ఓ షా ఫైజల్ హుస్సేని, జిల్లా విద్యాశాఖ అధికారి పాణిని, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ తుల రవి, డి సి ఓ సర్దార్ సింగ్, డి డబ్లూఓ శిరీష, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.