Friday, January 31, 2025
Homeఆంధ్రప్రదేశ్గద్దర్ పై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఖండించిన ఆత్రం సుగుణక్క

గద్దర్ పై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఖండించిన ఆత్రం సుగుణక్క

Listen to this article

పయనించే సూర్యుడు జనవరి 30 ఆదిలాబాద్ జిల్లా మండలం ఉట్నూర్ రిపోర్టర్ షైక్ సోహెల్ పాషా

పద్మ అవార్డు ఎంపిక నేపథ్యంలో గద్దర్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ ఇంచార్జ్ ఆత్రం సుగుణక్క తీవ్రంగా ఖండించారు ఉట్నూర్ మండల కేంద్రంలో మీడియతో మాట్లాడారు గద్దర్ పదవుల కోసమో డబ్బు కోసమో అవార్డుల కోసమో తన జీవితాన్ని ఫణంగా పెట్టి పని చేయలేదని తెలంగాణ కోసం పీడిత పేద ప్రజల కోసం అణగారిన వర్గాలు మహిళల కోసం గద్దర్ పోరాడారని గుర్తు చేశారు శరీరంలో బుల్లెట్లు ఉంచుకొని కూడా ప్రజల కోసం కొట్లాడిన వ్యక్తి గద్దర్ అని సుగుణక్క పేర్కొన్నారు గద్దర్ జీవితం గురించి బండి సంజయ్ తక్కువ చేసి మాట్లాడినంత మాత్రాన గద్దర్ స్థాయి తగ్గదన్నారు గద్దర్ పై విమర్శలు చేస్తే సూర్యుడి మీద ఉమ్మెయడం వంటిదేనన్నారు ప్రజల పాటగా ఆయన చిరస్మరణీయుడని ఆయన స్థాయిని అవార్డులు నిర్ణయించలేవన్నారు అసలు పద్మ అవార్డులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమా లేక బీజేపీ పార్టీనా అని సుగుణక్క ప్రశ్నించారు వివిధ రంగాల్లో దేశానికి సేవలందించిన ప్రముఖులను గుర్తించి ఇచ్చేందుకు తగిన మార్గదర్శకాలు ఉన్నాయని అలాంటప్పుడు బండి సంజయ్ తమ పార్టీ కార్యకర్తలను చంపినోళ్లకు అవార్డులు ఎలా ఇస్తారంటూ మాట్లాడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు పద్మ అవార్డులు అధికార పార్టీలు ఎంపిక చేసిన వారికే ఇస్తారా లేక సమాజానికి దేశానికి విశిష్ట సేవలందించిన సామాన్యులకు కూడా ఇస్తారా..అన్నదానిపై కేంద్రం ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉందన్నారు ఈ సమావేశంలో పార్వతి బాయి సుమిత్ర బాయి సావిత్ర బాయి సువర్ణా బాయి రాజమ్మ మీన విద్య సత్యవతి బాయి ఆత్రం నారాయణ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments