
పయనించే సూర్యుడు న్యూస్ చివ్వెంల మండల ప్రతినిధి బి.వెంకన్న ఫిబ్రవరి 14 సూర్యాపేట జిల్లా చివ్వెంల ఈరోజు కలెక్టర్ శ్రీ తేజస్ నంద లాల్ పవార్ గుంజలూరు గ్రామాన్ని ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది గుంజలూరు గ్రామంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పెదపొలు జయమ్మ w/o విష్ణుమూర్తి అజొల్లా పెంపకం చేపట్టడం జరిగింది ఇట్టి అజోల్లా పెంపకం పశువులకు మేతకు దాణాగా ఉపయోగించడం ద్వార పశువులలో పాల ఉత్పత్తి పెరగటానికి దోహదపడుతుంది ఈ అజోల్లా పెంపకం ద్వారా పశువులకు చాల రకాల ఉపయోగాలు ఉన్నాయి,ఇట్టి అజోల్లా పెంపకం 7 రోజులలో ఒక్క నీటి తొట్టిలో 2.5 కిలోల దాన తయారు కావడం దీనికి సంబందించిన దాణా నీటి తొట్లలో పెరుగుతుంది మూడు నీటి తొట్లలో వారానికి 7.5 కిలోల అజోల్లా దాణా తయారవడం జరుగుతుంది ఇదే కాకుండా వారికి ఉన్న పశువులకు ఎండా, వానలకు తడవకుండా పశువుల కొట్టం నిర్మాణం కూడ చేపట్టడం జరిగింది ఇట్టి నిర్మాణాన్ని కలెక్టర్ పరిశీలించి అట్టి రైతుతో మాట్లాడి వారికి కలిగే ప్రయోజనం గురించి అడిగి తెలుసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో ఈసీఓ డిఅర్ డిఓVV అప్పారావు,డిపిఓ నారాయణ రెడ్డి,ఎంపిడిఓ సంతోష్ కుమార్,ఎంపిఓ దయాకర్,ఏపిఓ నాగయ్య,ఈసీ జ్యోతి,టెక్నికల్ అసిస్టెంట్ విజయ్ కుమార్,పంచాయితి కార్యదర్శి శ్రావణి,ఫీల్డ్ అసిస్టెంట్ లక్ష్మీ పాల్గొనడం జరిగింది.
