
పయనించే సూర్యుడు జనవరి 21 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండల రిపోర్టర్ అశ్వారావుపేట మండల పరిధిలో ప్రభుత్వం పథకాల లబ్దిదారులను ఎంపిక చేసేందుకు నిర్వహిస్తున్న గ్రామ సభలు గందరగోళంగా మారాయి. మంగళవారం నుండి నాలుగు రోజులు పాటు మండలంలోని పంచాయతీలలో నిర్వహించే గ్రామసభలో లబ్దిదారులు అధికారులు చదివి వినిపించిన లిస్టుల్లో మా పేర్లు ఎందుకు లేవని అధికారులను నిలదీశారు. ముఖ్యమంగా పట్టణ పరిధలోని గుర్రాల చెరువు, అల్లిగూడెం గ్రామ పంచాయతీలలో జరిగిన గ్రామ సభ పోలీసుల పహారాలో నిర్వహించగా ధరఖాస్తు దారులు ఆందోళకు దిగారు. ఇంటింటికీ వచ్చి సర్వే అయితే చేశారు కానీ గ్రామ సభ లిస్టులో మా పేర్లు ఎందుకు లేవని పంచాయతీ అధికారులను నిలదీశారు. ఇందిరమ్మ గృహాలతో పాటు, రేషన్ కార్డులు సైతం అర్హులైనవారికి ఇవ్వకుండా అన్నీ ఉన్నవారికి ఇస్తున్నారని మారుతీనగర్ వాసులు పుసులూరి పద్మ, బల్లాని మౌనికలు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెల్లడించినలిస్టులో పేర్లు లేకపోవటంతో అర్హులైన వారు ఆందోళనకు దిగారు. దీంతో ఎస్సై యయాతీ రాజు సిబ్బంది సహాయంతో వారించే ప్రయత్నం చేశారు. అధికారులు చేసేది లేకపోవటంతో మళ్ళీ ధరఖాస్తులు చేసుకుంటే స్వీకరించి సర్వే చేస్తామని తెలపగా దరఖాస్తు దారులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఈ గ్రామ సభలో తహసిల్దార్ కృష్ణ ప్రసాద్, కార్యదర్శి స్వరూపా, ఏఈఓ సతీష్ తదితరులు పాల్గొన్నారు