

పయనించే సూర్యుడు జనవరి 18( గోరంట్ల మండల ప్రతినిధి ఫక్రోద్దీన్) శ్రీ సత్య సాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలం నిరుపేదలకు రెండు రూపాయలకే కిలో బియ్యం అందజేసి ప్రతి పేదవాడికి కూడు ,గుడ్డ, గూడు ,మహిళల అభ్యున్నతికి తోడ్పడిన, వృద్ధులకు పెన్షన్ పథకం అమలు చేసి నిరుపేదలకు అండగా నిలబడిన ఏకైక వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు అని రాజకీయరంగంలోనే కాకుండా సినీ రంగంలో కూడా పౌరాణిక చిత్రాలు తీసి ప్రజల మన్ననలు పొందాడని మాజీమంత్రి నిమ్మల కిష్టప్ప పేర్కొన్నారు అందులో భాగంగా గోరంట్ల మండలంలో మాజీ మంత్రి నిమ్మల కిష్టప్ప మరియు వారి తనయుడు నిమ్మల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు మాజీ మంత్రి నిమ్మల కిష్టప్ప గోరంట్ల మండలం తెలుగుదేశం నాయకులు బిజెపి జనసేన నాయకులు తో కలిసి స్థానిక సిటిసి థియేటర్ ఆవరణం నుండి బస్టాండ్ వద్ద ఉన్న ఎన్టీఆర్ సర్కిల్ వరకు ర్యాలీగా వచ్చి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం సిటీ థియేటర్ వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం బిజెపి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు