ఫోటో : ముగ్గులు వేస్తున్న దృశ్యం…
రుద్రూర్, జనవరి 15 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) : రుద్రూర్ మండల కేంద్రంలో ప్రజలు కనుమ పండుగ వేడుకలను బుధవారం ఘనంగా జరుపుకున్నారు. కనుమ పండుగ సందర్భంగా మహిళలు, చిన్నారులు ఇండ్ల ముందు ముగ్గులు వేశారు. ఆ ముగ్గులకు రంగులు అద్ది అందంగా అలంకరించారు. వంటకాలు తయారు చేసుకొని కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు కలిసి ఆరగించారు. చిన్నారులు గాలి పటాలను ఎగరవేస్తూ ఆనందంగా గడిపుతూ కనుమ పండుగ వేడుకలను జరుపుకున్నారు.