
పయనించే సూర్యుడు జనవరి 18 k శ్రీనివాసులు రిపోర్టర్ పెబ్బేరు వనపర్తి జిల్లా,… టీ టీడీపీ రాష్ట్ర
కార్యదర్శి రామన్ గౌడ్తె లుగుదేశంపార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు,మాజీ ముఖ్యమంత్రి వర్యులు పద్మశ్రీ నందమూరి తారకరామారావు 29వ వర్ధంతిని పురస్కరించుకొని
శనివారం పెబ్బేరు పట్టణం లోనీ ప్రభుత్వ హాస్పిటల్ లో తెలుగుదేశం పార్టీ నాయకులు రోగులకు పండ్లు బెడ్ పంపిణి చేసారు. ఈ సందర్బంగా తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి రామన్ గౌడ్ మాట్లాడుతు సమాజమే దేవాలయంప్రజలే దేవుళ్లు అని భావించి తెలుగుదేశంపార్టీని స్థాపించి బడుగు బలహీన వర్గాల వారికి అండగా నిలబడిన వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు సినీరంగంలో ముందు తరాలకు గుర్తుండేలా శ్రీ కృష్ణుడు రాముడు పలు దేవతల పాత్రలతో ప్రజల మనస్సుల్లో దేవుడుగాస్థానం తెలుగు ప్రజల ఆత్మ గౌరవం కోసం రాజకీయ పార్టీ స్థాపించి దేశ రాజకీయాల్లో సంచలనం. ఎన్టీర్ దేశ రాజకీయాల్లో తనదైన ముద్రవేసారు
యావత్ దేశంలో ఎక్కడ లేని విధంగా పేద వారికి కేజీ రెండు రూపాయల కే కిలో బియ్యం పదకంతో ఆహార భద్రత రైతాంగం కోసం భూమి శిస్తు రద్దు.
50 రూపాయలకే హార్స్ పవర్ కరెంట్ అందించినట్లు రామన్ గౌడ్ గుర్తు చేసారు ఆడవాళ్లకు ఆస్తిలో హక్కు మహిళల కోసం పద్మావతి యూనివర్సిటీ స్థాపన
గురుకుల విద్యా విధానం ప్రారంభించారు ప్రజల కు అందుబాటులోకి పాలన ఉండేందుకు మండల వ్యవస్థ ఏర్పాటు తెలంగాణలో కరణం వ్యవస్థ రద్దు చేసి ప్రజలకు ఎన్నో ప్రయోజలు చేకూర్చారని రామన్ గౌడ్ అన్నారు ఈ కార్యక్రమంలో పెబ్బేరు ప్రభుత్వ డాక్టర్ హరినాధ్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులు వాకిటి బాలరాజ్ రాఘవందర్ గౌడ్, తిరుమలేష్, మురళీగౌడ్,రాజు శెట్టి,పరమేష్, రాముడు చంద్రశేఖర్, ఎల్లారెడ్డి ఎల్లాస్వామి, బాలరాజ్ అరవిందు