పయనించే సూర్యుడు ఫిబ్రవరి 1 దండేపల్లి రిపోర్టర్ మందల మల్లేష్: దండేపల్లి మండల కేంద్రంలోనూ పద్మశాలి కులబంధువుల ఆరాధ్య దైవమైన మార్కండేయస్వామి మహర్షి జయంతి పురస్కరించుకోని దండేపల్లిలో పద్మశాలి సంఘ భవనంలో శనివారం మార్కండేయ స్వామి జయంతి వేడుకలను సంఘం నాయకులు వైభవంగా నిర్వహించారు ముందుగా ఆలయంలో అర్చకుడు బూర్ల వెంకటేశ్వ ర్లు భీమండి కి చెందిన పురోహితులు జంజిరాల నంబయ్య అధ్వర్యంలో శ్రీమార్కండేస్వామికి మహారుద్రభిషేకంతో పాటు ప్రత్యేక పూజలను నిర్వహించగా పద్మశాలి కులబందువులు ప్రత్యేక పూజలతో మొక్కులు చెల్లించుకున్నా రు. అనంతరం పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు నోదాల శంకర్ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో సంఘం నాయకులు వడ్డెపల్లి దేవయ్య, ఎనగందుల సుబ్బయ్య దేవేందర్ శ్రీనివాస్, శంకర్. రామస్వామి, తిరుపతి, సత్యం, కుడికాల రాజ్ కుమార్ . బోల్లి శ్రీనివాస్, దావనపల్లి సత్తన్న, కడారి పెద బుచ్చన్నలు, మహిళలు శంక రమ్మ, పద్మ, వెంకటలక్ష్మి, బ్యాగలక్ష్మి, యశోదలు పాల్గొన్నారు,,