Sunday, February 2, 2025
HomeUncategorizedఘనంగా మార్కండేయ జయంతి వేడుకలు..

ఘనంగా మార్కండేయ జయంతి వేడుకలు..

Listen to this article
  • ఆలయంలో పూజలు నిర్వహిస్తున్న దృశ్యం.

రుద్రూర్, ఫిబ్రవరి 1 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) : రుద్రూర్ మండల కేంద్రంలోని శ్రీ మార్కండేయ మందిరంలో శనివారం పద్మశాలి కులస్తులు మార్కండేయ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, మార్కండేయ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. అనంతరం ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం అధ్యక్షులు గెంటిల సాయిలు, ఉపాధ్యక్షులు జంగం సత్యం రాజ్, దెగ్లూరు గంగా కిషన్, ప్రధాన కార్యదర్శి గుద్దేటి వార్ కార్తీక్, కోశాధికారి అంకం దత్తు సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments