హైదరాబాద్: సర్వ హంగులతో స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీతో అధునాతనంగా నిర్మించిన చర్లపల్లి రైల్వే టెర్మినల్ (Cherlapalli Railway Terminal)ను సోమవారం మధ్యాహ్నం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) వర్చ్యువల్ (Virtual)గా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎయిర్‌పోర్టును తలపించేలా చర్లపల్లి రైల్వే స్టేషన్ నిర్మాణం జరిగిందని, రూ.413 కోట్ల వ్యయంతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ పనులు చేపట్టడం జరిగిందన్నారు. ఓఆర్ఆర్‌కు అత్యంత సమీపంలో చర్లపల్లి ఉందని, తెలంగాణ ప్రగతిలో ఇది అత్యంత కీలకంగా మారబోతోందని, సోలార్ స్టేషన్‌గా దీన్ని అభివృద్ధి చేశారని మోదీ వ్యాఖ్యానించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో భాగంగా.. చర్లపల్లి లాంటి స్టేషన్లు ఎంతో అవసరమని, 2014లో కేవలం 5 నగరాల్లోనే మెట్రో ఉందని, పదేళ్లలో 21 నగరాలకు మెట్రో విస్తరించిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.