మాదిగ కళాకారుల రాష్ట్ర కోఆర్డినేటర్ యసారపు రాంబాబు మాదిగ పిలుపు
పయనించే సూర్యుడు ప్రతినిధి, (శ్రీరామ్ నవీన్) తొర్రూర్ డివిజన్ కేంద్రం… ఫిబ్రవరి 7న లక్షల డబ్బులు వేల గొంతులు కార్యక్రమం, హైదరాబాదులో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని, మాదిగ కళాకారుల రాష్ట్ర కోఆర్డినేటర్ యాసారపు రాంబాబు మాదిగ పిలుపునిచ్చారు. గురువారం తొర్రూర్ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ఎమ్మార్పీఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరై, రాంబాబు మాట్లాడుతూ, జనవరి 17న తొర్రూర్ డివిజన్ కేంద్రంలో మాదిగల, మాదిగ ఉపకులాల ఆధ్వర్యంలో 300 మంది డప్పు కళాకారుల చేత, అంబేద్కర్ విగ్రహం నుండి పాల కేంద్రం వద్ద ఉన్న బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వరకు జరిగే భారీ ర్యాలీ కి మాదిగలు మాదిగ ఉపకులాలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ హాజరు కావడం జరుగుతుందని, కావున వివిధ గ్రామాల నుండి మాదిగలు మాదిగ ఉపకులాల ప్రజలు వేలాదిగా తరలి ఈభారీ ర్యాలీని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో తొర్రూరు మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య మాదిగ ఎం ఈ ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సోమారపు ఐలయ్య మాదిగ ఎం ఇ ఎఫ్ నాయకులు మాంకాల బుచ్చయ్య మాదిగ ఉమ్మడి వరంగల్ జిల్లా కోఆర్డినేటర్ బరిగెల బాబు మాదిగ మాజీ ఎంపీపీ తూర్పాటి చిన్న అంజయ్య ఈనపల్లి శ్రీనివాస్ మాదిగ తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు పంతం సురేందర్ మాదిగ ఎమ్మార్పీఎస్ నాయకులు వేల్పుల రమేష్ మాదిగ మంద యాకమల్లు మాదిగ వెల్తూరి పూర్ణచందర్ మాదిగ రాయిశెట్టి ఉపేందర్ మాదిగ వెంకన్న మాదిగ మంగళపల్లి నాగరాజు మాదిగ రంజిత్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.