
అత్యవసర చికిత్స నిమిత్తం వెళ్లడానికి గత సంవత్సరం లాగా కాకుండా ముందస్తు పడవ ఏర్పాటు చేయాలి!
నేషనల్ హైవే రోడ్డు ఎత్తు ఉండడం వలన వరదలకు బ్యాక్ వాటర్ మొత్తం వెనక్కి వస్తాయి కాబట్టి ముందుగానే మునిగిపోయే ప్రమాదం ఉంది కావున చాలా గ్రామాల నుండి ప్రయాణాలు ఈ రోడ్డు మార్గంలోని చేయాలి కాబట్టి ముందస్తు పడవ ఏర్పాటు చేయాలి
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ జూలై 16
అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం చింతూరు మండలం నర్సింహాపురం- గొర్రెలగూడెం జంక్షన్ వద్ద ముందస్తు వరదలను దృష్టిలో ఉంచుకొని ప్రజలను అయోమయో పరిస్థితికి గురికాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు, అలాగే చంద్రవంక వాగు నడుమ నరసింహపురం- గొర్రెలగూడెం లో ముందస్తు పడవ ఏర్పాటు చేయాలి. కూనవరం- నరసింహపురం మొదలుకొని 30 -35 వరకు గ్రామాలు ఉన్నాయి, ఆ గ్రామ ప్రజలందరూ భద్రాచలం వెళ్లాలన్న చింతూరు వెళ్ళాలన్న ఈ గొర్రెలగూడెం -నరసింహపురం జంక్షన్ రోడ్డు మార్గం మీదుగా వెళ్లాలి, అలాగే చిమర్జెన్సీ నిమిత్తం వెళ్లాలన్న ఈ గ్రామ ప్రజానీకానికి ఈ రోడ్డు మార్గమే దిక్కు అలాగే 2024 గత సంవత్సరంలో గర్భిణి స్త్రీలు బాగా నొప్పులు రావడం వలన రావడం జరిగింది. అప్పుడు ఈ జంక్షన్ లో లోతు ఎక్కువ ఉండడం వలన ఆ గర్భిణి చింతూరు ఏరియా హాస్పిటల్ కి వెళ్లడానికి సౌకర్యం లేదు, ఆ గర్భిణి స్త్రీ రెండు గంటలసేపు కూర్చోవడం జరిగింది. అప్పుడు చింతూరు ప్లడ్ గ్రూప్ లో మెసేజ్ ఫార్వర్డ్ చేయడం జరిగింది. అప్పుడు చింతూరు ఐటీడీఏ పీవో తక్షణమే స్పందించి అరగంటలో చింతూరు నుండి బోటు పంపించడం జరిగింది. అప్పుడు చింతూరు ఏరియా హాస్పిటల్ కి ఆ గర్భిణీ స్త్రీ ని చేర్చడం జరిగింది. అలాగే దానికి ముందు రోజు రాత్రి 12 గంటలకు అదే రోడ్డు జంక్షన్లో కుమ్మురు గర్భిణి స్త్రీని తుమ్మల వీఆర్వో ముచ్చిక సింగయ్య ట్రాక్టర్ సాయంతో ఆమెని అవతలికి దాటించడం జరిగింది. అప్పుడు భద్రాచలం హాస్పటల్ కి తరలించడం జరిగింది. అప్పుడు నడుము లోతు ఉంది కాబట్టి ట్రాక్టర్ సాయంతో దాటించడం జరిగింది . ఈ సంవత్సరం నేషనల్ హైవే రోడ్డు ఎత్తుగా పోయడం వలన ముందుగానే గోదారి బ్యాక్ వాటర్ చేరుకోవడం జరుగుతుంది అప్పుడు రాకపోకలకు అంతరాయం కలుగుతుంది, ఎందుకంటే పైనున్న కూనవరం మండలంలో చాలా గ్రామాల ప్రజలు వాళ్ళ అవసరాల నిమిత్తం కోసం చింతూరు అలాగే భద్రాచలం అలాగే ఇంకేమైనా పనుల మీద ఎమర్జెన్సీ కేసులు మీద ఈ రోడ్డు మార్గాన రావాలి, అందుకు మా బాధలను దృష్టిలో ఉంచుకొని చింతూరు ఐటీడీఏ వారు తక్షణమే ముందస్తు వరదలకు గొర్రెలగూడెం జంక్షన్ లో పడవ ఏర్పాటు చెయ్యాలని కోరుకుంటున్నాము.

