
పయనించే సూర్యుడు జనవరి 29 (ఆత్మకూరు నియోజకవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
చేజర్ల మండలం చిత్తలూరు గ్రామ సచివాలయం నందు బుధవారం పశు ఆరోగ్య శిబిరం నిర్వహించడం జరిగింది . ఈ పశు వైద్య శిబిరంలో .పాడి పశువులకు, దూడలకు నట్టల నివారణ, పశువులకు గర్భకోశ వ్యాధులకు చికిత్స చేయబడినది. ఈ కార్యక్రమంలో చిత్తలూరు గ్రామ నాయకులు మోదేపల్లి పెంచలనాయుడు . చేజర్ల పశు వైద్యులు డా.పి.రాజేష్, లైవ్ స్టాక్ అసిస్టెంట్ శ్రీకాంత్, పశువైద్య సహాయకులు సంజీదా, రియాజ్, సల్మాన్ . చిత్తలూరు గ్రామ పాడి రైతులు తదితరులు పాల్గొన్నారు.