

పయనించే సూర్యుడు తేదీ జనవరి 19 ఆదివారం గాజులరామారం రిపోర్టర్ : ఆడెపు సంతోష్ కుమార్ (మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా)… గాజులరామారం చిత్తారమ్మ దేవి జాతర శుక్రవారం ప్రారంభం అయ్యింది. వారం రోజులపాటు జరగనుంది జాతర ప్రారంభమై 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేశారు. శనివారం గవ్యాంత పూజలు మూలమంత్ర జపం, ఆవాహియ దేవతా హోమాలు, చండీ హోమం పూర్ణాహుతి రుత్విక్ సన్మానం, గాజుల రామారం గ్రామం నుంచి దేవాలయం వరకు పూలగటం ఊరేగింపు జరిగాయి. నేడు (19, ఆదివారం రోజున) ప్రధాన జాతర నిర్వహించనున్నారు. 20న రంగం భవిష్యవాణి కార్యక్రమాలు జరుగుతాయి. ఈనెల 21 నుంచి 24 వరకు కుంకుమార్చనలు 25న అమ్మవారికి భక్తులు సమర్పించిన ఒడిబియ్యంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ కూన అనంతయ్య గౌడ్ తెలిపారు.