Saturday, February 1, 2025
HomeUncategorizedచిన్నారులకు వ్యాధి నిరోధక టీకాలు

చిన్నారులకు వ్యాధి నిరోధక టీకాలు

Listen to this article

పయనించే సూర్యుడు ఫిబ్రవరి 1 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండల రిపోర్టర్ మండలం పరిధిలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో శనివారం మండలంలోని కొత్త పేరాయి గూడెం అంగన్వాడి సెంటర్ లో గర్భిణీ స్త్రీలకు ఐదేళ్ళ లోపు చిన్నారులకు వ్యాధి నిరోధక టీకాలు వేయడం జరిగింది. గ్రామల్లో 0-5 ఏళ్ళ లోపు చిన్నారులను గుర్తించి వారికి సమయానుకూలంగా అందించే పలురకాల టీకాలు వేశారు. ఈ సందర్భంగా ఆరోగ్య సిబ్బంది మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ తమ పిల్లలకు నెల నెల తప్పని సరి టీకాలు ఖచ్చితంగా వేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి సూపర్వైజర్ విజయలక్ష్మి ఎఎన్ఎం చిన్నలక్ష్మి, ఆశా కార్యకర్త వాణి అంగన్వాడీ టీచర్ వెంకటరమణ మరియమ్మ ఆయా రాములమ్మ సుజాత తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments